Mumbai Shocker: వంట రుచిగా వండలేదని స్నేహితుడిని చంపేశాడు, పారతో గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే యువకుడు మృతి, గొడవను ఆపటానికి వచ్చిన మరో వ్యక్తిపై కూడా నిందితుడు దాడి, ముంబైలో షాకింగ్ ఘటన

ఆహారం విషయంలో జరిగిన గొడవ స్నేహితుడి ప్రాణాన్ని (Labourer Kills Friend) తీసింది. నకు నచ్చినట్లుగా వంట రుచిగా వండలేదని పారతో స్నేహితుడిని మరో స్నేహితుడు కొట్టి (Dispute Over Food in Dahisar) చంపేశాడు.

Image used for representational purpose (Photo Credits: Pixabay)

Mumbai, March 4: మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆహారం విషయంలో జరిగిన గొడవ స్నేహితుడి ప్రాణాన్ని (Labourer Kills Friend) తీసింది. నకు నచ్చినట్లుగా వంట రుచిగా వండలేదని పారతో స్నేహితుడిని మరో స్నేహితుడు కొట్టి (Dispute Over Food in Dahisar) చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబైకి చెందిన 27 ఏళ్ల వ్యక్తి మరో స్నేహితుడితో కలిసి దహిసర్‌ ఏరియాలోని ఓ కన్‌స్ట్రక్షన్‌ సైట్‌లో పని చేస్తున్నాడు.

మంగళవారం వంట విషయంలో ఇద్దరికీ గొడవైంది. తనకు నచ్చిన విధంగా వంట చేయలేదంటూ నిందితుడు.. బాధితుడిపై గొడవకు దిగాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్యా వాగ్వివాదం చోటుచేసుకుంది. ఒకరినొకరు బూతులు తిట్టుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నిందితుడు.. బాధితుడి తలపై పారతో గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

గొడవను ఆపటానికి వచ్చిన మరో వ్యక్తిపై కూడా నిందితుడు దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

పెళ్లి అయిన మళ్లీ రోజే నగలతో వధువు జంప్, మరోచోట తెల్లారితే పెళ్లి..వధువు పరార్, ఇంకో చోట నువ్వు నాకు తెలుసు..వ్యభిచారం చేస్తావా అంటూ అసభ్యకర మెసేజ్‌లు

"మేము నిందితులను అరెస్టు చేసాము మరియు అతనిపై 302 (హత్య) తో సహా వివిధ భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ల కింద కేసు నమోదు చేసాము" అని దాహిసర్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ పాటిల్ చెప్పారు.



సంబంధిత వార్తలు

BRS Leader Errolla Srinivas Arrest: బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్..ఖండించిన మాజీ మంత్రి హరీశ్‌ రావు, ఇందిరమ్మ రాజ్యమా?..పోలీస్ రాజ్యామా? అని మండిపాటు

Kamareddy: వివాహేతర సంబంధం...ముగ్గురి ప్రాణాలు తీసింది, ఎస్సై సహా మహిళా కానిస్టేబుల్ మరోకరి ఆత్మహత్య..కామారెడ్డిలో సంచలనంగా మారిన ముగ్గురి ఆత్మహత్యలు

Police Angry On Allu Arjun: సినిమా వాళ్ళ బట్టలు ఊడతీస్తాం..అల్లు అర్జున్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. లేదంటే తోలు తీస్తాం అని హెచ్చరించిన ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి

Andhra Pradesh Shocker: కొడుకును సుపారీ ఇచ్చి హత్య చేయించిన తండ్రి, కొడుకు వేధింపులు భరించలేక అడవిలోకి తీసుకెళ్లి మద్యం తాగించి హత్య...వీడియో