Mumbai Power Outage: అంధకారంలో ముంబై నగరం, టాటా నుంచి విద్యుత్ స‌ర‌ఫ‌రా స్తంభించిన‌ట్లు తెలిపిన బృహ‌న్‌ముంబై ఎల‌క్ట్రిక్ స‌ప్ల‌య్ అండ్ ట్రాన్స్‌పోర్ట్, విద్యుత్ సమస్యపై ట్విట్టర్లో హోరెత్తుతున్న ట్వీట్లు

ముంబైన‌గ‌రం అంతా విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. ఇవాళ ఉద‌యం న‌గ‌రంలోని ప‌లు కీల‌క ప్రాంతాల‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా (Several Areas Without Electricity) జ‌ర‌గలేదు. దీంతో కొన్ని ప్రాంతాల్లో లోకల్ రైళ్లు నిలిచిపోయాయి. సోమవారం ఉదయం 10 గంటలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం వాటిల్లింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ లో అమజోర్ విద్యుత్ సరఫరాలో వైఫల్యం కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

Mumbai Power cut (Photo Credits: File Image)

Mumbai, October 12: దేశ ఆర్థిక రాజధాని ముంబై అంధకారంలోకి (Mumbai Power Outage) వెళ్లింది. ముంబైన‌గ‌రం అంతా విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. ఇవాళ ఉద‌యం న‌గ‌రంలోని ప‌లు కీల‌క ప్రాంతాల‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా (Several Areas Without Electricity) జ‌ర‌గలేదు. దీంతో కొన్ని ప్రాంతాల్లో లోకల్ రైళ్లు నిలిచిపోయాయి. సోమవారం ఉదయం 10 గంటలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం వాటిల్లింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ లో అమజోర్ విద్యుత్ సరఫరాలో వైఫల్యం కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

ముంబై, థానే నగరాల్లోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో వాటిల్లిన అంతరాయంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ముంబైలోని కీలక ప్రాంతాలైన కొలబా, మాహిమ్, బాండ్రాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గ్రిడ్ వైఫల్యం కారణంగా ముంబై నగరంలోని సబర్బన్ రైలు సర్వీసులు నిలిచిపోయాయని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసరు చెప్పారు. చ‌ర్చ్‌గేట్ నుంచి వాసాయి రైల్వే స్టేష‌న్ మ‌ధ్య న‌డిచే లోక‌ల్ రైళ్ల‌ను నిలిపేశారు.

సముద్రంలో మునిగిపోనున్న ముంబై నగరం? తాజా పరిశోధనల హెచ్చరిక, అధిక జనాభా, భారీ నిర్మాణాలతో భూమి కుంగిపోతుందని వెల్లడించిన రిపోర్ట్స్

ముంబై నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయానికి తాము చింతిస్తున్నామని బృహన్ ముంబై విద్యుత్ సరఫరా, రవాణ సంస్థ తెలిపింది. విద్యుత్ సరఫరాలో అంతరాయంతో పలువురు వినియోగదారులు ట్విట్టరులో ఫిర్యాదులు చేశారు. కాగా టాటా నుంచి విద్యుత్ స‌ర‌ఫ‌రా (Tata Power Supply) స్తంభించిన‌ట్లు బృహ‌న్‌ముంబై ఎల‌క్ట్రిక్ స‌ప్ల‌య్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ పేర్కొన్న‌ది.

తాజ్‌హోట‌ల్‌ను బాంబులతో పేల్చేస్తాం, లష్కరే తోయిబా ఉగ్రవాదుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్, అప్రమత్తమైన ముంబై పోలీసులు

గ్రిడ్ ఫెయిల్యూర్ వ‌ల్ల ఈ స‌మ‌స్య ఉత్ప‌న్న‌మైన‌ట్లు తెలుస్తోంది. సౌత్‌, సెంట్ర‌ల్‌, నార్త్ ప్రాంతాల్లో విద్యుత్ సర‌ఫ‌రా సంపూర్ణంగా నిలిచిపోయిన‌ట్లు తెలుస్తోంది. 400 కేవీ లైన్ ట్రిప్ అయిన‌ట్లు స‌మాచారం. అయితే ఆ ఎల‌క్ట్రిక్ లైన్‌ను పున‌రుద్ద‌రిస్తున్నారు. ప‌వ‌ర్‌గ్రిడ్‌లో సాంకేతిక లోపం త‌లెత్తిన‌ట్లు తెలుస్తోంది. ఎంఐడీసీ, పాల్గ‌ర్‌, ద‌హ‌నూ లైన్ల‌లో స‌ర‌ఫ‌రా పూర్తిగా నిలిచిపోయింది. ముంబై న‌గ‌రానికి వెళ్తున్న 360 మెగా వాట్ల ప‌వ‌ర్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌లిగిన‌ట్లు తెలుస్తోంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు మాత్రం ట్రేడింగ్‌ను కొన‌సాగిస్తున్నాయి.