Taj Mahal Palace Hotel at Colaba (Photo credits: Instagram)

Mumbai, June 30: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉన్న ప్ర‌ఖ్యాత తాజ్‌హోట‌ల్‌కు (Taj Hotel in Mumbai) బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వ‌చ్చింది. దీంతో తాజ్ హోట‌ల్ వ‌ద్ద గ‌ట్టి బందోబ‌స్తును ఏర్పాటు చేశారు. పాకిస్థాన్‌లోని క‌రాచీ నుంచి ఆ ఫోన్ కాల్ (Bomb Threat Call) వ‌చ్చిన‌ట్లు ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు. బాంబుల‌తో తాజ్ హోట‌ల్‌ను పేల్చివేస్తామ‌ని బెదిరించిన‌ట్లు ముంబై పోలీసులు (Mumbai Police) చెప్పారు. ఈ నేప‌థ్యంలో హోట‌ల్‌తో పాటు స‌మీప ప్రాంతాల్లోనూ భ‌ద్ర‌త‌ను కట్టుదిట్టం చేశారు. పెళ్లయిన 2 రోజులకే వరుడిని కరోనా కాటేసింది, బీహార్‌లో పెళ్లికి వచ్చిన వారిలో 95 మందికి కోవిడ్-19, దేశంలో తాజాగా 18,522 పాజిటివ్ కేసులు నమోదు

హోటల్ వెలుపల మరియు చుట్టుపక్కల భద్రతను కఠినతరం చేశారు మరియు ఈ ప్రాంతంలో పోలీసు సిబ్బందిని నియమించారు. అధికారులు ఈ ప్రాంతమంతా వాహనాల తనిఖీని నిర్వహిస్తుండగా, హోటల్ ప్రాంగణంలో కూడా శోధించారు. బాంబు బెదిరింపు కాల్ తరువాత భద్రతా చర్యగా ముంబైలోని తాజ్ హోటల్‌కు వెళ్లే అన్ని రహదారులు కూడా మూసివేయబడ్డాయి. కాల్ చేసిన వ్యక్తి తనను లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాద సంస్థలో సభ్యుడిగా గుర్తించి ముంబైలోని రెండు హోటళ్లను పేల్చివేస్తానని బెదిరించాడు.

Here's ANI Tweet

రెండవ కాల్ బాంద్రాలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్‌లో సిబ్బందికి వచ్చింది. పాకిస్థాన్‌కు చెందిన కాల్ చేసిన వ్యక్తి ఇదే పద్ధతిలో హోటల్‌ను పేల్చివేస్తానని బెదిరించాడు. రెండు కాల్స్ ఒకే సంఖ్యల నుండి స్వీకరించబడ్డాయి.

ఇదిలా ఉంటే క‌రాచీలో నిన్న స్టాక్ ఎక్స్‌చేంజ్‌పై ఉగ్ర‌వాదులు దాడి చేసిన విష‌యం తెలిసిందే. ఆ దాడికి పాల్ప‌డిన న‌లుగురు ఉగ్ర‌వాదుల‌ను భ‌ద్ర‌తా ద‌ళాలు హ‌త‌మార్చాయి. ఈ నేపథ్యంలో ఇవాళ అర్థ‌రాత్రి 12.30 నిమిషాల‌కు తాజ్ హోటల్ ని పేల్చేస్తామని ఉగ్రవాదుల నుంచి ఫోన్ కాల్ వ‌చ్చిన‌ట్లు అధికారులు తెలిపారు. కాగా 2008లో తాజ్‌హోట‌ల్‌పై ఉగ్ర‌వాదులు దాడి చేసిన విష‌యం తెలిసిందే. ఆ ఉగ్ర‌దాడిలో 166 మంది మృతిచెందారు. 300 మందికిపైగా గాయ‌ప‌డ్డారు. పాక్‌కు చెందిన ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాదులు ఆ దాడికి ప్లానేశారు.