Mumbai Shocker: పావ్‌ బాజి కోసం వెళ్లిన 8 ఏళ్ల బాలిక ముఖంపై వేడి నూనె పోసేశారు, ముంబైలో షాకింగ్ ఘటన, అయ్యో పాపం అంటున్న స్థానికులు, రంగంలోకి దిగిన పోలీసులు..

ఒకరిపై మరొకరు దుర్బాషలాడుకుంటూనే వేడి వేడి నూనెను పారబోసుకున్నారు. అదే సమయంలో షాపుకు వచ్చిన 8సంవత్సరాల బాలిక (8Year old girl)పై ఆ వేడి నూనె(OIL) పడటంతో తీవ్రంగా గాయపడింది. ముఖం, ఛాతీ పూర్తిగా కాలిపోవడంతో చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రి(hospital)కి తరలించారు.

(photo-file images)

Mumbai: మహరాష్ట్ర లో ఇద్దరు చిరువ్యాపారుల మధ్య గొడవ ఓ బాలిక ప్రాణాలకు ముప్పు తెచ్చింది. ముంబైలోని సబర్బన్ కుర్లాలో ఇద్దరు పావ్ భాజి(Pav Bhaji) వ్యాపారులు ఇంటి విషయంలో ఘర్షణపడ్డారు. ఒకరిపై మరొకరు దుర్బాషలాడుకుంటూనే వేడి వేడి నూనెను పారబోసుకున్నారు. అదే సమయంలో షాపుకు వచ్చిన 8సంవత్సరాల బాలిక (8Year old girl)పై ఆ వేడి నూనె(OIL) పడటంతో తీవ్రంగా గాయపడింది. ముఖం, ఛాతీ పూర్తిగా కాలిపోవడంతో చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రి(hospital)కి తరలించారు. రెండ్రోజుల క్రితం కసాయివాడ (Kasaiwada)జిల్లా కుర్లా(Kurla)లోని సూపర్‌ మార్కెట్‌ దగ్గర పావు బాజి బిజినెస్ చేస్తున్నారు వసీం ఖలీల్ అన్సారీ(Wasim Khalil Ansari), ముస్తకీమ్ హమీక్‌ అన్సారీ (Mustaqeem Hamik Ansari). ఏదో విషయంపై ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. ఒకరిపై మరొకరు మండిపడుతూ వాగ్వాదానికి దిగారు. గొడవ మరింత పెద్దది కావడంతో ఖలీల్‌ కడాయితో కొట్టాడు. అందుకు ప్రతిగా హమీక్ అన్సారీ ఖలీల్ అన్సారీపై కళాయిలో ఉన్న వేడి వేడి నూనెను విసిరికొట్టాడు. అదే సమయంలో పావు బాజి కొనుక్కునేందుకు షాపు దగ్గరకు వచ్చిన 8సంవత్సరాల అఫ్సీన్‌ షేక్‌( Afsin Sheikh)అనే బాలిక ముఖంపై నూనె పడింది. అంతే కళాయిలోని కాలిపోతున్న నూనె చిన్నారిపై పడటంతో గట్టిగా ఏడుస్తూ కేకలు పెట్టింది. బాలికతో పాటు ఆమె వెంట వచ్చిన 76 సంవత్సరాల మున్వర్ అలీ(Munwar Ali)కి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించారు.

పెగాసస్ స్కామ్‌పై సుప్రీం కీలక తీర్పు, జాతీయ భద్రత పేరుతో బాధ్యతల నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్య, పెగాసస్‌ వ్యవహారంపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిన అత్యున్నత న్యాయస్థానం

పావ్ బాజి వ్యాపారుల పంచాయితీ..

రెండ్రోజుల క్రితం వ్యాపారస్తుల మధ్య తలెత్తిన ఈ చిన్న గొడవ చివరకు చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రస్తుతం అఫ్సీన్‌ షేక్ ముఖం, ఛాతీ ఎక్కువ శాతం కలిపోవడంతో డాక్టర్లు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కారకులైన ఇద్దరు పావు బాజి వ్యాపారులు వసీం ఖలీల్ అన్సారీ, ముస్తకీమ్ హకీమ్ అన్సారీలను అరెస్టు చేశారు. చిన్నారితో పాటు అలీ దగ్గర స్టేట్‌మెంట్ రికార్డ్ చేసుకున్నారు పోలీసులు. ఇద్దరు పావు బాజి వ్యాపారులపై కేసు నమోదు చేసినట్లు కుర్లా పోలీసులు తెలిపారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement