Mumbai Horror: ముంబైలో దారుణం, కూతురు ఇంట్లోనే శవమై కనిపించిన తల్లి, ట్యాంక్‌లోని స్టీల్ బాక్స్‌లో మాంసం, ఎముకల ముక్కలు, కూతురును అరెస్ట్ చేసిన పోలీసులు
ఓ మహిళ ఇంట్లో ప్లాస్టిక్ బ్యాగ్‌లో కుళ్లిన స్థితిలో ఉన్న మరో మహిళ మృతదేహం తీవ్ర కలకలం రేపింది. దీంతో ఆమె 23 ఏళ్ల కూతురుని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. సీనియర్ పోలీసు అధికారి ప్రవీణ్ ముండే తెలిపిన కథనం ప్రకారం..వీణా జైన్ అనే మహిళ తన ఇంట్లోనే ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌లో శవమై కనపించింది.
Mumbai, Mar 15: ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ ఇంట్లో ప్లాస్టిక్ బ్యాగ్‌లో కుళ్లిన స్థితిలో ఉన్న మరో మహిళ మృతదేహం తీవ్ర కలకలం రేపింది. దీంతో ఆమె 23 ఏళ్ల కూతురుని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. సీనియర్ పోలీసు అధికారి ప్రవీణ్ ముండే తెలిపిన కథనం ప్రకారం..వీణా జైన్ అనే మహిళ తన ఇంట్లోనే ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌లో శవమై కనపించింది.
ఆమె మృతదేహం బ్యాగ్‌లో కుళ్లిన స్థితిలో ఉన్నట్లు తెలిపారు. అలాగే ట్యాంక్‌లోని స్టీల్ బాక్స్‌లో మాంసం, ఎముకల ముక్కలు కనిపించాయని పోలీసుల తెలిపారు. నెలల తరబడి బ్యాగ్‌లో ఉండటంతో మృతదేహం కుళ్లిన స్థితిలో ఛిద్రమై ఉందని తెలిపారు.పోలీసులు అనుమానంతో మృతురాలితో పాటు ఉంటున్న ఆమె కూతుర్ని సైతం పోలీసుల విచారించారు. ఐతే పోలీసులు ఆమే హత్య చేసి ఉండొచ్చన్న అనుమానంతో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
ఇదిలా ఉండగా, సదరు మహిళ వీణా జైన్ చివరిసారిగా నవంబర్ 26న చూశామంటూ మృతురాలి సోదరుడు, మేనల్లుడు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆమె కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు..చివరగా అనుమానంతో ఆమె అపార్ట్‌మెంట్‌ని సోదాలు చేయడం ప్రారంభించారు. అక్కడ ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌లో చిధ్రమై ఉన్న ఆమె మృతదేహ్నాన్ని గుర్తించినట్లు తెలిపారు పోలీసులు. ఐతే ఆమె గతేడాది డిసెంబర్లో మెట్లపై నుంచి పడిపోయిందని చెబుతున్నారు పోలీసులు. ఐతే ఆమె ఎలా చనిపోయిందనేది అనేది తెలియాల్సి ఉందన్నారు పోలీసులు.
కాగా, ఇటీవల ఢిల్లీలో శ్రద్ధా వాకర్‌ని ఆమె ప్రియుడే కిరాతకంగా చంపిన ఘటన మరువుక మునేపే అదేతరహాలో వరుస ఘటనలు చోటు చేసుకోవడం బాధకరం.