Mumbai Rains: ఓ వైపు కరోనా..మరోవైపు వర్ష విలయం, విలవిలలాడుతున్న ముంబై, 46 ఏళ్ల తర్వాత కొలాబాలో అత్యధిక వర్షపాతం, రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్

భారీ వర్షాలతో దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai Rains) అతలాకుతలమవుతోంది. గంటకు 107 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో ప్రభుత్వం ఇప్పటికే సబర్బన్‌ రైలు, బస్సు సేవలను నిలిపివేసింది. ఇక ‘గేట్‌ వే ఆఫ్‌ ఇండియా’ (Gate way of India) వంటి పర్యాటక ప్రదేశాలు కలిగిన దక్షిణ ముంబైలోని కొలాబాలో (Colaba) అధిక వర్షపాతం నమోదయ్యింది. గత 46 సంవత్సరాల్లో.. ఆగస్టు నెలలో.. ఒక్క రోజులో ఇంత భారీ వర్షపాతం నమోదవ్వడం ఇదే ప్రథమం అని అధికారులు అంటున్నారు.

High tide hits Marine Drive. (Photo Credits: ANI)

Mumbai, August 6: భారీ వర్షాలతో దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai Rains) అతలాకుతలమవుతోంది. గంటకు 107 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో ప్రభుత్వం ఇప్పటికే సబర్బన్‌ రైలు, బస్సు సేవలను నిలిపివేసింది. ఇక ‘గేట్‌ వే ఆఫ్‌ ఇండియా’ (Gate way of India) వంటి పర్యాటక ప్రదేశాలు కలిగిన దక్షిణ ముంబైలోని కొలాబాలో (Colaba) అధిక వర్షపాతం నమోదయ్యింది. గత 46 సంవత్సరాల్లో.. ఆగస్టు నెలలో.. ఒక్క రోజులో ఇంత భారీ వర్షపాతం నమోదవ్వడం ఇదే ప్రథమం అని అధికారులు అంటున్నారు.

గడిచిన 24 గంటల వ్యవధిలో ఈ ప్రాంతంలో 331.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఆగస్టు నెల పూర్తి వర్షపాతంలో దాదాపు 64 శాతం వాన ఈ ఐదు రోజుల వ్యవధిలోనే నమోదయినట్లు అధికారులు తెలిపారు. అధిక వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం (Maharashtra Govt) ఇప్పటికే అత్యవసర సేవలు మినహా అన్ని కార్యాలయాలను మూసి వేసింది. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబై రెండు రోజుల పాటు బంద్, దేశ ఆర్థిక రాజధానిని వణికిస్తున్న వర్షాలు, చెరువులను తలపిస్తున్న లోతట్టు ప్రాంతాలు, రెడ్‌ అలర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలను కోరారు. ముంబై, పరిసర ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులకు సంబంధించి మహారాష్ట్ర ముఖ్యమంత్రికి అన్ని విధాలా సహకరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం హామీ ఇచ్చారు. భారీ వర్షాల నేపధ్యంలో ముంబైలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.

రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మొత్తం మీద నగరం మరో సముద్రాన్ని తలసిస్తోంది. వరద నీరుపూర్తిగా రోడ్లపై చేరడంతో జనజీవనం, రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించి పోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చెంబూర్, పరేల్, హింద్మాత, వడాలా సహా పలు ప్రాంతాలు నీట మునిగాయి. 20 లక్షలకు చేరువలో కరోనా కేసులు, 40 వేలు దాటిన మరణాలు, గత 24 గంటల్లో 56,282 కోవిడ్-19 కేసులు నమోదు

భారీ వర్షాల నేపధ్యంలో.. హార్బర్ లైన్‌లోని సీఎస్‌ఎంటీ స్టేషన్లు, మెయిన్ లైన్‌లోని సీఎస్‌ఎంటీ కుర్లా, చర్చ్‌గేట్-కుర్లా స్టేషన్ల మధ్య సబ్ అర్బన్ రైళ్లను నిలిపివేశారు. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే పలు రైల్వే స్టేషన్లు వరద నీట మునిగాయి. వర్షం నీరు నిలిచి పోవటంతో మసీదు-భయ్‌ఖలా స్టేషన్ల మధ్య రెండు రైళ్లు చిక్కుకుపోయాయి. ఆ ప్రదేశానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకొని పడవల సాయంతో ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షాలు తగ్గకపోవడంతో... గతంలో 2005లో వచ్చిన వరదలు మాదిరిగానే భారీ ముప్పు పొంచి ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now