New Delhi, August 6: భారత్‌లో గత కొన్ని రోజులుగా 50 వేలకు పైగా పాజిటివ్ కేసులు (Coronavirus in India) వెలుగుచూస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 56,282 మంది కరోనా బారిన పడ్డారు. నిన్న ఒక్కరోజే(బుధవారం) అత్యధికంగా 904 మంది కరోనాతో మృత్యువాత (Coronavirus deaths in india) పడ్డారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,64,537కు చేరింది. కరోనా బారిన పడి మొత్తం 40,699 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 5,95,501 యాక్టివ్ కేసులు ఉండగా, 13,28,337 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇక బుధవారం 6,64,949 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఇప్పటి వరకు మొత్తం 2,21,49,351 టెస్టులు పూర్తి చేశారు.
దేశంలో కరోనా మరణాల రేటు ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా అత్యల్పంగా ఉన్నప్పటికీ, గడచిన నెలలో దేశంలో 20 వేలకు పైగా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. వీటిలో 10 వేల మరణాలు గత 13 రోజులలో సంభవించాయి. గడచిన 6 రోజుల్లో 5 వేల మంది మృతి చెందారు. ఇంతకుముందు ఒక్క రోజులో గరిష్ట మరణాలు 848. ఇది ఆగస్టు ఒకటిన నమోదైంది. . కరోనావైరస్ జన్యువు వీక్ అవుతోంది, శుభవార్తను చెప్పిన ఇటలీ శాస్త్రవేత్తలు
మరణాలతో మహారాష్ట్ర ఆధిక్యంలో ఉంది. తమిళనాడులో 112, ఆంధ్రప్రదేశ్‌లో 77, బెంగాల్‌లో 61, పంజాబ్‌లో 29, బీహార్‌లో 44, పుదుచ్చేరిలో 7 మరణాలు సంభవించాయి. మరోవైపు, ఢిల్లీలో బుధవారం 11 మరణాలు మాత్రమే చోటుచేసుకున్నాయి. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లలో కొత్తగా 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఈ సంఖ్య 10,309, ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంఖ్య 10,128గా ఉంది. కరోనాపై భారీ ఊరట, రికవరీ రేటు 67.19కి పెరిగిందని తెలిపిన ఆరోగ్య శాఖ, మృతుల శాతం 2.09కి తగ్గిందని వెల్లడి, దేశంలో 19 లక్షలు దాటిన కోవిడ్-19 కేసులు
బ్రెజిల్‌లో దేశంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 2,859,073కు చేరగా 97,256 మంది మృత్యువాతపడ్డారని జాతీయ ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం తెలిపింది. బుధవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 1,154 మంది మృతి చెందారని పేర్కొంది. ప్రపంచంలో అమెరికా తరువాత అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నది బ్రెజిల్‌లోనే. అమెరికాలో ఇప్పటివరకు 4.8 మిలియన్ల మందికి పైగా కరోనా బారినపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 18.6 మిలియన్ల మంది వైరస్ బారినపడగా తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ల కారణంగా 7,03,000 మందికి పైగా మృతి చెందారని అమెరికాకు చెందిన ప్రఖ్యాత జాన్స్ హోప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది.