Nagaland Civilian Killings: అసలేం జరిగింది, నాగాలాండ్ కాల్పుల ఘటనపై నేడు ఉభయసభల్లో అమిత్ షా కీలక ప్రకటన, కూలీలపై జవాన్లు కాల్పులు జరిపిన ఘటనపై పార్లమెంట్‌లో ఆందోళన చేపట్టిన విపక్షాలు
మధ్యాహ్నం మూడు గంటలకు లోక్ సభలో ఆ తర్వాత గంటకు రాజ్యసభలో(Lok Sabha and Rajya Sabha) అమిత్ షా దీనిపై మాట్లాడనున్నట్లు పార్లమెంటరీ వర్గాలు తెలిపాయి.
New Delhi, December 6: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఆరో రోజు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పార్లమెంట్‌లో నాగాలాండ్ ఘటనపై (Nagaland Civilian Killings) విపక్షాలు తీవ్ర ఆందోళనలు చేపట్టాయి. కాల్పుల ఘటనపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. కాల్పుల్లో (Nagaland Firing Incident)14 మంది అమాయక ప్రజలు చనిపోవడాన్ని ప్రతి పక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇంకా 11 మంది ఆస్పత్తుల్లో చావు బతుకులతో పోరాడుతున్నారు. బొగ్గు గనిలో పని పూర్తిచేసుకొని పాటలు పాడుకుంటూ వాహనంలో ఇళ్లకు తిరిగి వస్తున్న కార్మికులపై సైనికులు తుపాకులు ఎక్కుపెట్టారు.
ఈ కాల్పుల ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు పార్లమెంట్ ఉభయసభల్లో కీలక ప్రకటన (Amit Shah Likely to Make Statement) చేయనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు లోక్ సభలో ఆ తర్వాత గంటకు రాజ్యసభలో(Lok Sabha and Rajya Sabha) అమిత్ షా దీనిపై మాట్లాడనున్నట్లు పార్లమెంటరీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే నాగాలాండ్ కాల్పుల ఘటనపై ప్రతిపక్ష ఎంపీలో ఉభయ సభల్లో వాయిదా తీర్మానం చేశాయి. మరో వైపు పౌరులపై కాల్పులకు పాల్పడ్డ సైన్యానికి చెందిన పారా ప్రత్యేక బలగం ఎలైట్ యూనిట్ పై నాగాలాండ్ రాష్ట్ర పోలీసులు సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బలగాల అనాలోచిత చర్య కారణంగా పౌరులు ప్రాణాలు కోల్పోయారని నాగాలాండ్ పోలీసులు ఆరోపించారు. ఆపరేషన్ కోసం రాష్ట్ర పోలీసుల నుంచి ఎలాంటి గైడ్ తీసుకోకుండానే కాల్పులు జరిపారని తెలిపారు. ఇది పూర్తిగా భద్రతా బలగాల ఉద్దేశపూర్వక హత్య అని ఎప్ఐఆర్ లో పేర్కొన్నారు.
అసలేం జరిగింది: నాగాలాండ్ మయన్మార్ సరిహద్దు మోన్ జిల్లాలో భద్రతా బలగాలు శనివారం జరిపిన కాల్పులు కలకలం రేపతున్నాయి. తిరుగుబాటుదారులుగా పొరబడి సామాన్య కూలీలపై ఎలైట్ యూనిట్ కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఏడు మంది కూలీలు మరణించారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు బలగాలను చుట్టిముట్టి దాడి చేశారు. వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో ఆత్మరక్షణ కోసం ఆర్మీ జవాన్లు మళ్లీ కాల్పులు జరపడంతో మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇక పౌరుల దాడిలో ఓ సామాన్యుడు ప్రాణాలు కోల్పోయాడు.