Nagaland Firing : నాగాలాండ్ లో ఘోరం, తీవ్రవాదులు అనుకొని కూలీలపై కాల్పులు, 14 మంది మృతి, భద్రతా దళాల వాహనాలకు నిప్పు పెట్టిన స్థానికులు..
Gunfight (Representational Image/ photo Credit: PTI)

కోహిమా, డిసెంబర్ 5 :  నాగాలాండ్‌లో (Nagaland) దారుణం జరిగింది. మోన్‌ జిల్లాలో ఉగ్రవాదులనుకొని సాధారణ పౌరులపై కాల్పులు జరిపారు భద్రతా బలగాలు. జవాన్ల కాల్పుల్లో 14మంది సాధారణ పౌరులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఆగ్రహంతో భద్రతాబలగాల వాహనాలను తగలబెట్టారు ప్రజలు. మోన్‌ జిల్లా తిరు గ్రామానికి సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు 13 మంది పౌరులు మరణించినట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాల్పుల ఘటన తర్వాత వచ్చిన చిత్రాలలో వాహనాలు దగ్ధమైనట్లు కనిపిస్తున్నాయి. ఈ ఘటన నాగాలాండ్‌లోని (Nagaland) మోన్‌ జిల్లాలో ఓటింగ్ సందర్భంగా చోటుచేసుకుంది. నివేదిక ప్రకారం, సంఘటన తర్వాత కోపంతో ఉన్న గ్రామస్థులు భద్రతా దళాల వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పలువురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో భద్రతా దళాలు సైతం కాల్పులకు తెగబడ్డారు. అయితే, అదే సమయంలో అటుగా వస్తున్న కూలీల వాహనం చూసి ఉగ్రవాదులుగా భావించి కాల్పులు జరిపారు జవాన్లు. కూలీల బృందం తిరు గ్రామం నుంచి వస్తుండగా ఈ ఘటన జరిగింది. 14మంది సాధారణ పౌరులు మృతి చెందారు.

మోన్ జిల్లాలోని ఓటింగ్ గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల తర్వాత గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా దళాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానికులు హింసకు పాల్పడ్డారు. NSCN మిలిటెంట్లుగా పొరపాటుపడి అమాయక యువకులను పొట్టన పెట్టుకున్నారని ఆందోళనకు దిగారు.. భద్రతా సిబ్బందికి చెందిన పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు మరోసారి కాల్పులు జరిపినట్లు సమాచారం. ఆ కాల్పుల్లో మరికొందరికి గాయాలయినట్లు స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో తిరు గ్రామం నివురు గప్పిన నిప్పులా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ నెలకొంది.

నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫియో రియో ​​శాంతి కోసం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీనిపై దర్యాప్తు చేసేందుకు ఆయన సిట్‌ను ఏర్పాటు చేశారు. మోన్‌కే ఓటింగ్‌ మేలో పౌరుల హత్య దురదృష్టకర ఘటన తీవ్ర ఖండనీయమని సీఎం ట్వీట్‌ చేశారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను మరియు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ఘటనపై ఉన్నత స్థాయి సిట్‌తో విచారణ జరిపించి, దేశంలోని చట్ట ప్రకారం న్యాయం జరుగుతుందని, శాంతి కోసం సమాజంలోని అన్ని వర్గాల వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఘటనపై హోంమంత్రి అమిత్ షా కూడా విచారం వ్యక్తం చేశారు. నాగాలాండ్‌లో జరిగిన ఓటింగ్‌ దురదృష్టకర ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మృతుల కుటుంబాలకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సిట్ ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టనుంది.

మృతుల్లో చాలా మంది బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికులుగా గుర్తించారు. శనివారం సాయంత్రం పనులు ముగించుకొని ఇళ్లకు వస్తున్న సమయంలో భద్రతాదళాలు కాల్పులు జరిపారని స్థానికులు తెలిపారు. వారికి ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని స్థానికులు చెబుతున్నారు. తప్పుడు సమాచారంతో వారిని చంపేశారని ఆరోపిస్తున్నారు. ఇదిలావుంటే, మృతుల సంఖ్యపై కొంత గందరగోళం నెలకొంది. ఆరుగురు చనిపోయారని అధికారులు చెబుతుంటే.. మొత్తం 14 మందిని చంపేశారని స్థానికులు చెబుతున్నారు.