Nagaland Protests: అట్టుడుకుతున్న నాగాలాండ్‌, సాయుధ బలగాలకు ప్రత్యేకాధికార చట్టం రద్దు చేయాలంటూ నిరసనలు, రాష్ట్రవ్యాప్తంగా కదం తొక్కిన నాగా స్టూడెంట్స్ ఫెడరేషన్‌

కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో నాగాలాండ్ (Nagaland ) అట్టుడుకుతోంది. సాధారణ పౌరులపై ఆర్మీ కాల్పుల ఘటన(Nagaland Deaths)పై అక్కడి ప్రజల్లో తీవ్ర అగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని(Armed Forces (Special Powers) Act) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అమిత్ షా(Amit Shah) దిష్టిబొమ్మలను దగ్ధం

Nagaland December 17: కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో నాగాలాండ్ (Nagaland ) అట్టుడుకుతోంది. సాధారణ పౌరులపై ఆర్మీ కాల్పుల ఘటన(Nagaland Deaths)పై అక్కడి ప్రజల్లో తీవ్ర అగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని(Armed Forces (Special Powers) Act) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అమిత్ షా(Amit Shah) దిష్టిబొమ్మలను దగ్ధం చేసిన తీవ్ర నిరసనలు వ్యక్తచేస్తున్నారు. ఇప్పటివరకు పౌరసంఘాలు మాత్రమే నిరసనలు తెలుపగా, వాళ్లకు నాగాలాండ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (Naga Students' Federation) తోడయ్యింది.

నాగాలాండ్‌(Nagaland)లో నిన్న, మొన్నటివరకూ మొన్(Mon) జిల్లాకే పరిమితమైన ఆందోళనలు తాజాగా నాగాలాండ్(Nagaland) రాజధాని కోహిమా(Kohima)కు విస్తరించాయి. కోహిమా కేంద్రంగా నాగాలాండ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (Naga Students' Federation) మెరుపు ధర్నా చేపట్టింది. వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేశారు. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (AFSA) రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చేతుల్లో ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం రద్దుకు ముందు.. ఇంకెన్ని బుల్లెట్లు దింపుతారని ప్లకార్డుల ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కోహిమాలో వరుసగా మూడు రోజుల నుంచి నిరసన ప్రదర్శనలు చేపడుతూనే ఉన్నారు. ఇప్పటికే నాగాలాండ్‌కు చెందిన కోన్యక్ యూనియన్, ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ ఆర్మీకి సహాయ నిరాకరణ ప్రకటించాయి. అంతేకాదు, ఇకనుంచి ఏ జాతీయ వేడుకల్లోనూ పాల్గొనబోమని... తమ ప్రాంతంలో ఆర్మీ రిక్రూట్ మెంట్లను అనుమతించేది లేదని ప్రకటించాయి.

Nagaland Firing : నాగాలాండ్ లో ఘోరం, తీవ్రవాదులు అనుకొని కూలీలపై కాల్పులు, 14 మంది మృతి, భద్రతా దళాల వాహనాలకు నిప్పు పెట్టిన స్థానికులు..

మొన్ జిల్లాతో పాటు కిఫిరే, నోక్లక్, లాంగ్ లెంగ్ జిల్లాల్లో స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, షాపులను మూసేశారు. నిరసన ప్రదర్శనల కారణంగా పలుచోట్ల ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాధారణ పౌరులపై కాల్పులు జరిపిన ఆర్మీ జవాన్లను వెంటనే అరెస్ట్ చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అలాగే ఈ నెల 6న లోక్‌ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ట్రక్కును ఆపాల్సిందిగా ఆర్మీ జవాన్లు కోరినప్పటికీ.. అది ముందుకు దూసుకెళ్లడంతో... ఉగ్రవాదులుగా పొరబడి కాల్పులు జరిపారని అమిత్ షా చేసిన ప్రకటనను నాగా ప్రజలు ఖండిస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలియజేశారు. సాయుధ బలగాల ప్రత్యేక చట్టాన్ని రద్దు చేయాల్సిందేనని అక్కడి ప్రజలు పట్టుబడుతున్నారు. తప్పు చేసిన వారికి కఠిన శిక్ష పడాల్సిందేనని నాగా ప్రజలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Donald Trump 2.0: గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును 'గల్ఫ్ ఆఫ్ అమెరికా'గా మార్చిన డొనాల్డ్ ట్రంప్,అంతర్జాతీయ భద్రత కోసం గ్రీన్‌ల్యాండ్‌ కొనుగోలుకు సరికొత్త వ్యూహం

Donald Trump on BRICS Nations: బ్రిక్స్ దేశాలకు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్, అమెరికా డాలర్‌కు నష్టం కలిగించే ఏ దేశానికైనా 100 శాతం సుంకం విధిస్తామని హెచ్చరిక

Trump Says Putin 'Destroying Russia': సంధి కుదుర్చుకోకుండా రష్యాను పుతిన్ నాశనం చేస్తున్నాడు, తొలి రోజే మిత్రుడికి షాకిచ్చిన అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్

Donald Trump 2.0: అమెరికాలో పుట్టిన విదేశీ పిల్లలకు యూఎస్ పౌరసత్వం రద్దు, లక్షలాది మంది భారతీయుల మెడపై వేలాడుతున్న బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ కత్తి, అసలైంటి ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ?

Share Now