Defamation Case: నాగార్జునపై కూడా పరువు నష్టం దావా వేస్తాం, కొండా సురేఖ లాయర్ కీలక వ్యాఖ్యలు, కేసు తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా

నాగచైతన్య-సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల మీద నాగార్జున కోర్టులో పరువునష్టం దావా వేశారు

Nagarjuna, Naga Chaitanya and Amala attended Nampally court Over Defamation Case suit on Konda Surekha Comments

Hyd, Oct 7: హీరో అక్కినేని నాగార్జున, ఆయన భార్య అక్కినేని అమల, తనయుడు నాగచైతన్య, యార్లగడ్డ సుప్రియ తదితరులు నాంపల్లి కోర్టుకు వచ్చారు. నాగచైతన్య-సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల మీద నాగార్జున కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో నాగార్జున స్టేట్‌మెంట్‌ను నాంపల్లి కోర్టు నేడు రికార్డ్ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.

కొండా సురేఖపై పిటిషన్ ఎందుకు దాఖలు చేశారని నాగార్జునను న్యాయస్థానం ప్రశ్నించింది. తన కుటుంబంతో పాటు నాగచైతన్య-సమంత విడాకుల అంశంపై మంత్రి సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని కోర్టుకు నాగార్జున తెలిపారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో తమ కుటుంబ పరువు, మర్యాదలకు భంగం వాటిల్లిందని ఆయన వాంగ్మూలం ఇచ్చారు.

వీడియో ఇదిగో, పిఠాపురంలో మైనర్ బాలికపై టీడీపీ నేత దారుణ అత్యాచారం, బాలిక అపస్మారక స్థితికి చేరుకోవడంతో..

రాజకీయ దురుద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారని, అన్ని టీవీ ఛానళ్లలోనూ ఇది ప్రసారమైందని వెల్లడించారు. తమపై అసత్య ఆరోపణలు చేసిన ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వాంగ్మూలం సందర్భంగా కోరారు. మంత్రి కొండా సురేఖ ఇటీవల రాజకీయ విమర్శల్లో భాగంగా నాగార్జున, నాగచైతన్య, సమంత పేర్లను ప్రస్తావించారు. కేటీఆర్ తో ముడిపెడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలపై తెలుగు సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు.

చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, నాని తదితరులు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మరోవైపు, నాగార్జున పరువు నష్టం దావా వేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.అంతకుముందు, మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో నాగార్జున, ఆయన కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి నాంపల్లి కోర్టుకు బయలుదేరారు. నాగార్జున రాక నేపథ్యంలో నాంపల్లి ప్రత్యేక కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేసినందుకు నాగార్జున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయనపై కూడా తాము పరువునష్టం దావా వేస్తామని కొండా సురేఖ తరఫు న్యాయవాది తెలిపారు. అఫైర్ల గురించి కేటీఆర్, కేసీఆర్‌కు బాగా తెలుసునని వ్యాఖ్యానించారు.నాంపల్లి కోర్టు ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కొండా సురేఖ మెదక్ ఇంఛార్జ్ మంత్రిగా ఉన్న సమయంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గౌరవసూచకంగా ఆమె మెడలో నూలు వస్త్రాన్ని కప్పారని, కానీ దీనిని బీఆర్ఎస్ సోషల్ మీడియా అనుచితంగా చూపించిందన్నారు. ఫోన్ ట్యాపింగ్‌లో ఎన్నో విషయాలు వెలుగు చూశాయన్నారు.

నాగచైతన్య, సమంత విషయంలో నాగార్జున గురించి మాట్లాడిన కొండా సురేఖ ఆ తర్వాత తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. బీసీ మంత్రి కొండా సురేఖపై, ప్రభుత్వంపై బురదజల్లే ఉద్దేశంతో నాగార్జున పరువునష్టం దావా వేశారని ఆరోపించారు. నాగార్జున వేసిన కేసులో ఏమీలేదన్నారు. నాగార్జున వేసిన పరువునష్టం దావా కేసులో వాదనలు విన్న కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసిందన్నారు. టీపీసీసీ లీగల్ సెల్ పక్షాన తాము నాగార్జునకు సంబంధించిన అన్ని విషయాలను ఆర్టీఐ ద్వారా బయటకు తీస్తున్నామన్నారు. ఆ తర్వాత నాగార్జునపై తాము పరువునష్టం కేసు వేస్తామన్నారు.



సంబంధిత వార్తలు