National Recruitment Agency: నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త, ఇకపై అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఎన్‌ఆర్‌ఏ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కామన్ ఎలిజిబిలిటీ పరీక్షలు నిర్వహించేందుకు జాతీయ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (NRA) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో ఎన్‌ఆర్‌ఏ ఏర్పాటును ప్రభుత్వం ప్రతిపాదించింది. నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీపై (National Recruitment Agency) కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రసంగంలో ప్రకటన చేశారు. ఈ మేరకు NRA ఏర్పాటుకు బుధవారం కేంద్రకేబినెట్ ఆమోద ముద్రవేసింది.
New Delhi, August 19: దేశంలోని నిరుద్యోగులకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం (Modi Govt) శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కామన్ ఎలిజిబిలిటీ పరీక్షలు నిర్వహించేందుకు జాతీయ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (NRA) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో ఎన్‌ఆర్‌ఏ ఏర్పాటును ప్రభుత్వం ప్రతిపాదించింది. నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీపై (National Recruitment Agency) కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రసంగంలో ప్రకటన చేశారు.
ఈ మేరకు NRA ఏర్పాటుకు బుధవారం కేంద్రకేబినెట్ ఆమోద ముద్రవేసింది.ఈ నిర్ణయం దేశంలో ఉద్యోగాలు కోరుకునే యువతకు తోడ్పాటు అందిస్తుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీల భర్తీకి ఎన్‌ఆర్‌ఏ ఒకే ఎంట్రన్స్ పరీక్షను నిర్వహిస్తుంది.
ప్రతి ఏటా సుమారు 1.25 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. సుమారు 2.5 కోట్ల మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. ఐతే వేర్వేరు శాఖలకు సంబంధించిన ఉద్యోగాలకు వేర్వేరు పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఆగస్టు 30 న ప్రధాని మోదీ మన్ కీ బాత్, దేశ, విదేశాల్లోని ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్న ప్రధాని, 1800-11-7800కి డయల్ చేసి మీ సందేశాన్ని ఇవ్వండి
రైల్వే, ONGC, NTPC, బ్యాంకులు పలు ఉద్యోగాలకు ఆయా శాఖలే పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఐతే ఇకపై వీటన్నింటింటికీ ఒకే పరీక్ష (CET) నిర్వహిస్తారు. ఆ పరీక్షలో సాధించిన స్కోరుకు మూడేళ్ల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. ఆ స్కోర్ ఆధారంగానే ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మళ్లీ మళ్లీ పరీక్షలు రాయాల్సిన అవసరం ఉండదు.
Update by ANI
ప్రస్తుతం నియామక పరీక్షలను యూపీఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీ వంటి సంస్ధలు నిర్వహిస్తున్నాఆయి. ఇక ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో (పీపీపీ) మోడల్ కింద జైపూర్, తిరువనంతపురం, గౌహతి ఎయిర్‌పోర్టులను లీజుకు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ ఎయిర్‌పోర్ట్‌లను ప్రైవేట్ డెవలపర్‌కు అప్పగించడం ద్వారా ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు 1070 కోట్ల రూపాయలు సమకూరుతాయని మంత్రి తెలిపారు. ఈ మూడు ఎయిర్‌పోర్ట్‌ల అభివృద్ధిని చేసేందుకు కేంద్రప్రభుత్వం డెవలపర్‌గా అదానీ గ్రూప్‌ను ఎంపిక చేసింది