Navjot Kaur Gets Rs.850 Crore Notice: క్యాన్స‌ర్ ట్రీట్ మెంట్ పై వివాదంలో న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ, ఆయ‌న భార్య‌కు రూ. 850 కోట్లుకు లీగ‌ల్ నోటీసులు

ఈ నేపథ్యంలో సిద్ధూ భార్య నవజ్యోత్‌ కౌర్‌కు 850 కోట్ల మేర లీగల్‌ నోటీసు అందింది. ఛత్తీస్‌గఢ్ సివిల్ సొసైటీ (CCS) ఈ నోటీసు జారీ చేసింది. ఆమె క్యాన్సర్ రికవరీ డైట్ గురించి సిద్ధూ చేసిన వాదనలపై వివరణ కోరింది.

Navjot Singh Sidhu , Navjot Kaur Sidhu (Photo Credits: X)

Amritsar, NOV 29:  క్యాన్సర్‌ బారిన పడి చివరి దశలో ఉన్న తన భార్య ఆయుర్వేద పద్ధతులు, ఆ ఆహారం ద్వారా దాని నుంచి కోలుకున్నదని (Cancer Recovery) కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) ఇటీవల వాదించారు. నవంబర్ 21 న బహిరంగ మీడియా సమావేశం ద్వారా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో సిద్ధూ భార్య నవజ్యోత్‌ కౌర్‌కు 850 కోట్ల మేర లీగల్‌ నోటీసు అందింది. ఛత్తీస్‌గఢ్ సివిల్ సొసైటీ (CCS) ఈ నోటీసు జారీ చేసింది. ఆమె క్యాన్సర్ రికవరీ డైట్ గురించి సిద్ధూ చేసిన వాదనలపై వివరణ కోరింది.

TRAI Clarifies OTP Delays: ఓటీపీ ఆలస్యాలపై క్లారిటీ ఇచ్చిన ట్రాయ్, యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా, డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్‌ 

కాగా, ఈ సందర్భంగా నవజ్యోత్ కౌర్‌కు (Navjot Kaur) సీసీఎస్‌ కొన్ని ప్రశ్నలు సంధించింది. మీ ఆరోగ్యం, క్యాన్సర్‌ నుంచి కోలుకోవడం గురించి మీ భర్త (Siddu) వాదనలకు మీరు మద్దతు ఇస్తున్నారా? మీ చికిత్స కోసం మీరు తీసుకున్న అల్లోపతి మందులు ప్రభావం చూపలేదని మీరు నమ్ముతున్నారా? మీరు కోలుకోవడానికి వేప ఆకులు, నిమ్మరసం, తులసి, పసుపు వంటి ఆహారాన్ని మాత్రమే తీసుకున్నారా? లేదా మీరు అల్లోపతి మందులను కూడా వాడారా? అని ప్రశ్నించింది.

 Navjot Singh Sidhu's Viral Video

 

మరోవైపు క్యాన్సర్ రోగులు చికిత్సను వదిలేసేలా, మధ్యలోనే మందులు మానివేసేలా సిద్ధూ వాదనలు ప్రభావితం చేస్తున్నాయని ఛత్తీస్‌గఢ్ సివిల్ సొసైటీ (CCS) ఆరోపించింది. క్యాన్సర్‌ రోగుల జీవితానికి ఇది ప్రమాదం పెంచిందని విమర్శించింది. ఈ నేపథ్యంలో సిద్ధూ వాదనలకు మద్దతు ఇచ్చే సాక్ష్యాలను ఏడు రోజుల్లోగా సమర్పించాలని ఆ సంస్థ డిమాండ్‌ చేసింది. లేని పక్షంలో ప్రజలను ‘తప్పుదోవ పట్టించే’ వాదనలకు పరిహారంగా రూ.850 కోట్లు చెల్లించాలని సిద్ధూ భార్య కౌర్‌ను ఆ నోటీస్ ద్వారా కోరింది.