Kota Suicides: కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య, ఈ ఏడాది 9కి చేరిన విద్యార్థులు సూసైడ్ కేసుల సంఖ్య, తీవ్ర ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు
తాజాగా మరో విద్యార్థి తనువు చాలించాడు.హర్యానా రోహ్‌తక్‌కు చెందిన సుమిత్ అనే 20 ఏళ్ల విద్యార్థి నీట్ పరీక్షకు (NEET aspirant) సన్నద్ధమవుతున్నాడు.
Jaipur, April 29: రాజస్థాన్ (Rajasthan) కోటా (Kota)లో విద్యార్థుల ఆత్మహత్య (Prevent Suicides)లు కొనసాగుతున్నాయి. తాజాగా మరో విద్యార్థి తనువు చాలించాడు.హర్యానా రోహ్‌తక్‌కు చెందిన సుమిత్ అనే 20 ఏళ్ల విద్యార్థి నీట్ పరీక్షకు (NEET aspirant) సన్నద్ధమవుతున్నాడు. గత ఏడాది కాలంగా కోటాలోని కున్హాడి ల్యాండ్‌మార్క్ సిటీలో ఉన్న ఓ హాస్టల్‌లో ఉంటూ.. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ సెంటర్‌లో కోచింగ్ తరగతులకు హాజరవుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం అతను తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసు అధికారులు విచారణ జరుపుతున్నారు.
ఆదివారం సాయంత్రం సుమిత్‌కు అతడి తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో వారు హాస్టల్ వార్డెన్‌కు ఫోన్ చేశారు. సిబ్బంది సుమిత్ గది వద్దకు వెళ్లి చూడగా.. అప్పటికే ఉరేసుకొని కనిపించాడు. దీంతో హాస్టల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. కోటాలో మళ్లీ ఇంకో విద్యార్థి ఆత్మహత్య, తాజా మరణంతో ఈ ఏడాది 26కి చేరిన విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య
కోచింగ్ హబ్ అయిన రాజస్థాన్‌లోని కోటాలో ఒత్తిడి వల్ల విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపుతోంది. తాజా ఘటనతో కలిసి ఈ ఏడాది ఇప్పటి వరకూ ఇది తొమ్మిదో ఘటన కావడం గమనార్హం. ఇక గతేడాది ఏకంగా 30 మంది దాకా విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. 2023లో మొత్తం 29 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోగా, 2024లో ఏప్రిల్ 29 ఘటనతో కలిపి ఇప్పటి వరకు 9 కేసులు నమోదయ్యాయి.
ఇటీవల, తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు ప్రకటించిన కొన్ని గంటలకే తెలంగాణకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏడుగురు విద్యార్థుల్లో ఒకరు నాలుగు సబ్జెక్టుల్లో, మిగిలిన వారు ఒకటి రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినట్లు స్థానిక నివేదికలు పేర్కొన్నాయి.