Nationwide Chakka Jam: రైతులకు మంచి నీళ్లు బంద్, ఇంటర్నెట్ సేవలు బంద్, అయినా వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పిన రైతు సంఘాలు, ప్రభుత్వ తీరుకు నిరసనగా ఫిబ్రవరి 6న దేశ వ్యాప్తంగా చక్కా జామ్, రిపబ్లిక్ డే రోజున జరిగిన హింసపై నేడు సుప్రీంలో విచారణ

ఈ నెల 6న దేశ వ్యాప్తంగా భారత్ బంద్ (Bharat Bandh)చేపట్టాలని రైతు సంఘాలు నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. అయితే భారత్ బంద్ ప్లేసులో దేశవ్యాప్తంగా రాస్తారోకో (చక్కా జామ్) (Nationwide Chakka Jam) నిర్వహించాలని నిర్ణయించారు. ఆ రోజున జాతీయ, రాష్ట్ర రహదారులను మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటలపాటు దిగ్భంధం చేయనున్నామని రైతుల సంఘాలు ప్రకటించాయి.

Farmers Protest in Delhi. (Photo Credits: ANI)

New Delhi, February 3: కేంద్ర ప్రభుతం ప్రవేశ పెట్టిన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నెల రోజులకు పైగా రైతులు ధర్నాలు చేస్తున్నారు. కాగా రిపబ్లిక్ డే రోజున రైతుల ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే.. అయితే కేంద్రం సాగు చట్టాలను వెనక్కి తీసుకునే వరకూ తమ ఆందోళన (Farmers Protest) విరమించేంది లేదని రైతు సంఘాలు తెల్చి చెప్పాయి, తాజాగా రైతు సంఘాలు మరో ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.

ఈ నెల 6న దేశ వ్యాప్తంగా భారత్ బంద్ (Bharat Bandh)చేపట్టాలని రైతు సంఘాలు నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. అయితే భారత్ బంద్ ప్లేసులో దేశవ్యాప్తంగా రాస్తారోకో (చక్కా జామ్) (Nationwide Chakka Jam) నిర్వహించాలని నిర్ణయించారు. ఆ రోజున జాతీయ, రాష్ట్ర రహదారులను మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటలపాటు దిగ్భంధం చేయనున్నామని రైతుల సంఘాలు ప్రకటించాయి. కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి జరిగిన కేటాయింపులతో తమకు సంబంధం లేదని, తాము కోరుకుంటున్నది సాగు చట్టాల రద్దేనని రైతు నేత రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు.

ఢిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో బడ్జెట్ విషయాల గురించి తమకు ఎటువంటి సమాచారం లేదని పేర్కొన్నారు. పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర గురించి ప్రభుత్వం మాట్లాడడం లేదని, తాము ప్రధానితో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ రుణ లక్ష్యాన్ని పెంచినంత మాత్రాన ప్రయోజనం లేదని, రైతుల ఆదాయాన్ని పెంచే చర్యలు చేపట్టాలని గ్రామీణ్ కిసాన్ మజ్దూర్ సమితి నేత రంజీత్ రాజు తెలిపారు.

సామాన్యుల నడ్డి మళ్లీ విరగనుందా.., పన్ను చెల్లింపుదారులకు కనపడని మినహాయింపులు,పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు, తగ్గనున్న బంగారం, వెండి ధరలు, భారీగా పెరిగిన ద్రవ్యలోటు

కేంద్ర వార్షిక బడ్జెట్‌లో రైతులను పట్టించుకోలేదనీ, సాగు రంగానికి కేటాయింపులను తగ్గించి వేసిందని స్వరాజ్‌ అభియాన్‌ నేత యోగేంద్ర యాదవ్‌ విమర్శించారు. మరోవైపు ఢిల్లీ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను కట్టడి చేసేందుకు యంత్రాంగం పక్కా ఏర్పాట్లు చేపడుతోంది.

ఇందులో భాగంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనలకు ప్రధాన కేంద్రమైన సింఘూ బార్డర్ ను పోలీసులు దిగ్బంధించారు. రైతులకు మంచి నీటి సరఫరాను నిలిపివేయడంతో పాటు, వారు కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా వెళ్లే పరిస్థితి లేకుండా చేశారు. నాలుగు నుంచి ఐదడుగుల సిమెంట్ గోడలను నిర్మించిన పోలీసులు, సంయుక్త కిసాన్ మోర్చా నిరసనకారులకు ఢిల్లీతో ఎటువంటి సంబంధం లేకుండా చేశారు.

మొత్తం ఐదు వరుసల్లో బారికేడ్లను నిర్మించారు. 1.5 కిలోమీటర్ల దూరం పాటు వీటిని నిర్మించారు. రైతులు టాయిలెట్ అవసరాలను వినియోగించుకునేందుకు పదికి పైగా మొబైల్ టాయిలెట్ వాహనాలను అక్కడ ఏర్పాటు చేయగా, వాటి వద్దకు వెళ్లకుండా రైతులను నియంత్రించారు. ఢిల్లీ జల్ బోర్డు వారికి నిత్యమూ మంచినీటిని సరఫరా చేస్తుండగా వాటిని కూడా నిలిపివేశారు. వాహనాలు వెళ్లకుండా భారీ ఎత్తున అడ్డుగోడలు కట్టారు.

దేశ‌వ్యాప్తంగా డిజిట‌ల్ ప‌ద్ధ‌తిలో జనాభా లెక్కింపు, 75 ఏళ్లు పైబడిన వారికి ఐటీ రిటన్స్‌ దాఖలు నుంచి మినహాయింపు, ఒకే దేశం... ఒకే రేషన్ కార్డు దేశ వ్యాప్తంగా అమలు, బడ్జెట్ 2021 కీ పాయింట్స్ ఇవే

పోలీసుల చర్యలతో రైతులు అయోమయ పరిస్థితుల్లో పడినా, తామేమీ వెనుకంజ వేయబోమని, పోలీసుల చర్యలు తమ నిరసనలను ఆపలేవని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. "మేము రైతులము. మేము బావులు తవ్వకుంటాం. మా అవసరాలను మేమే తీర్చుకుంటాం. మా గురించి ప్రభుత్వాలు ఎన్నడూ పట్టించుకోలేదు. మా గ్రామాలకు మేమిప్పుడు వెనక్కు తిరిగి వెళ్లే పరిస్థితి లేదు. మా భవిష్యత్తు, మా బిడ్డల భవిష్యత్తు కోసం ఎంత దూరమైనా వెళతాం" అని రైతు సంఘం నేత కుల్జిత్ సింగ్ వ్యాఖ్యానించారు.

కాగా, రైతుల దైనందిన అవసరాలను తీర్చేందుకు హర్యానా ప్రభుత్వం కొన్ని వాటర్ ట్యాంకర్లను పంపించింది. కాలకృత్యాల అవసరాలను తీర్చేందుకు కొన్ని టాయిలెట్లు మాత్రమే ఇప్పుడు రైతులకు అందుబాటులో ఉన్నాయి. దీంతో చాలా మంది, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, పారిశుద్ధ్య సమస్య ఏర్పడకుండా చర్యలు చేపట్టామని హర్యానా అధికారులు వెల్లడించారు.

రూ .16.5 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు, రైల్వేలకు రూ.1.10 లక్షల కోట్లు కేటాయింపు, కాలం తీరిన వాహనాలను తుక్కుగా మార్చే కొత్త పథకం, మరో కోటి మందికి ఉజ్వల పథకం, కేంద్ర బడ్జెట్ 2021-22 హెలెట్స్ ఇవే..

రైతులపై పోలీసుల వేధింపులు ఆపేదాకా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేది లేదని సంయుక్త కిసాన్‌ మోర్చా తేల్చిచెప్పింది. అలాగే పోలీసులు అక్రమంగా నిర్బంధించిన అన్నదాతలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌చేసింది. బారికేడ్లను పెంచడం, కందకాలు తవ్వడం, రోడ్లపై మేకులు అమర్చటం, ముళ్లకంచెలు ఏర్పాటుచేయడం, ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేయడం, బీజేపీ, ఆరెస్సెస్‌ కార్యకర్తలతో నిరసనలు చేయించడం ద్వారా కేంద్రం, పోలీసులు, అధికార యంత్రాంగం రైతులపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించింది. రైతుల ఉద్యమానికి మద్దతు పెరుగుతుండటంతో కేంద్రంలో వణుకు పుట్టినట్టు కనిపిస్తున్నదని పేర్కొన్నది.

ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులకు స్థానికులు అండగా నిలుస్తున్నారు. తమ నివాసాల నుంచి వారికి విద్యుత్‌ సౌకర్యం అందిస్తున్నారు. అలాగే మహిళా నిరసనకారులకు తమ ఇండ్లలో మరుగుదొడు వినియోగించుకునేందుకు అనుమతిస్తున్నారు. ఇటీవల సింఘు సరిహద్దులో రైతులకు, ‘స్థానికులకు’ మధ్య ఘర్షణ తలెత్తిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ పురామాయించిన వ్యక్తులే నాడు దాడికి దిగారన్న ఆరోపణలున్నాయి.

ఆరు మూల స్థంభాలతో బడ్జెట్, పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2021-22 ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, హైలెట్స్ పాయింట్స్ ఇవే..

గత నెలలో రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ డే పరేడ్‌లో చెలరేగిన హింసాకాండపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు బుధవారం విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే, న్యాయమూర్తులు జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ వీ రామ సుబ్రహ్మణ్యన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరుపనుంది. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న నిర్వహించిన ర్యాలీలో విధ్వంసం చోటు చేసుకుంది.

వేలాది మంది ఆందోళనకారులు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్దలు కొట్టి, పోలీసులపై సైతం దాడికి దిగారు. ఎర్రకోటలో మతానికి సంబంధించిన జెండాలను ఎగుర వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తునకు సర్వోన్నత న్యాయస్థానం.. విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాలంటూ న్యాయవాది విశాల్ తివారి పిటిషన్‌ దాఖలు చేశారు. సదరు కమిషన్‌లో హైకోర్టు మాజీ న్యాయమూర్తులు ఇద్దరు ఉండాలని విజ్ఞప్తి చేశారు. ర్యాలీలో జాతీయ జెండాను అవమానించిన వ్యక్తులు, సంస్థలపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరారు.

తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మొండి చేయి, బడ్జెట్లో కనపడని తెలుగు రాష్ట్రాల మెట్రో ఊసు, ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు పెద్ద పీఠ వేసిన నిర్మలమ్మ బడ్జెట్

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు నెలలుగా రైతుల కొనసాగుతుందని, అయితే ట్రాక్టర్‌ పరేడ్‌ సందర్భంగా ‘హింసాత్మక మలుపు’ తీసుకుందని న్యాయవాది తివారి పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ఘటన ప్రజల రోజువారి జీవితాన్ని ప్రభావితం చేసిందని, ప్రభుత్వ ఆదేశాలతో ఇంటర్నెట్‌ సేవలకు అంతరాయం ఏర్పడిందన్నారు. ప్రస్తుతం న్యాయవాదులతో సహా పలు వృత్తుల్లో ఉన్న వారికి ఇంటర్నెట్‌ చాలా అవసరమని పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు ఎలాంటి ఆధారాలు లేకుండా రైతులను ఉగ్రవాదులుగా ముద్ర వేయకుండా అధికారులకు, మీడియాకు ఆదేశాలివ్వాలంటూ మనోహర్‌లాల్‌ శర్మ అనే మరో న్యాయవాది పిటిషన్​ దాఖలు చేశారు.

రైతుల నిరసనను దెబ్బతీసేందుకు ప్రణాళికబద్దమైన కుట్ర జరిగిందని ఆయన పిటిషన్‌లో ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రైతులను ఉగ్రవాదిగా ప్రకటించే ‘తప్పుడు ఆరోపణలు, చర్యలను’ ప్రచారం చేయడాన్ని నిషేధించాలని కోరారు. న్యాయవాదులు విశాల్‌ తివారి, మనోహర్‌లాల్‌ శర్మ దాఖలు చేసిన పిటిషన్లతో పాటు మరికొన్ని పిటిషన్లను కూడా కోర్టు విచారించనుంది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now