Farm Cess on Fuel| Representational Image | (Photo Credits: PTI)

New Delhi, Feb 1: కేంద్ర బ‌డ్జెట్‌ 2021లో కేంద్ర ప్ర‌భుత్వం ఊర‌ట కోసం చూస్తున్న సామాన్యుల న‌డ్డి విరిచింది. ఇప్ప‌టికే భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లపై సెస్ (Agricultural Infratsruture and Development CESS) పేరుతో మ‌రింత భారం మోపింది. అగ్రిక‌ల్చ‌ర్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్‌ సెస్ (Agri Infra Cess) పేరుతో పెట్రోల్‌పై రూ.2.5, డీజిల్‌పై రూ.4 సెస్ విధించారు. దీంతో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు మ‌రింత పెర‌గ‌నున్నాయి. అయితే ఈ విషయాన్ని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు.

ఇక పన్నులు (Tax) చెల్లించేవారిపై ఈ బడ్జెట్ (Union Budget 2021) నీళ్లు చల్లింది. వారికి ఎలాంటి మినహాయింపులూ ప్రకటించలేదు. ఆదాయపన్ను (Income Tax) శ్లాబుల్లో కేంద్రం ఎలాంటి మార్పులూ చేయలేదు. మరోవైపు 75 ఏళ్లు దాటిన వారికి మాత్రం కేంద్రం భారీ ఊరటనిచ్చింది. 75 ఏళ్లు దాటినవారు ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే చిన్న పన్ను చెల్లింపుదారులకు వివాద పరిష్కార కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Here's FM Speech

ఇక బంగారం ధరలు దిగిరానున్నాయి. వెండి ధరలు (Gold and Silver Rates) కూడా తగ్గనున్నాయి. కేంద్ర బడ్జెట్ 2021లో ప్రవేశపెట్టిన సంస్కరణల కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎలక్ట్రికల్, ఆటోమోటివ్ విడిభాగాలు, మొబైల్ ఫోన్స్ తదితరాల ధరలు మాత్రం పెరగనున్నాయి. బంగారం, వెండిపై క‌స్టమ్స్ సుంకాన్ని క్ర‌మ‌బ‌ద్దీక‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పార్ల‌మెంట్‌లో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు.

దేశ‌వ్యాప్తంగా డిజిట‌ల్ ప‌ద్ధ‌తిలో జనాభా లెక్కింపు, 75 ఏళ్లు పైబడిన వారికి ఐటీ రిటన్స్‌ దాఖలు నుంచి మినహాయింపు, ఒకే దేశం... ఒకే రేషన్ కార్డు దేశ వ్యాప్తంగా అమలు, బడ్జెట్ 2021 కీ పాయింట్స్ ఇవే

నైలాన్ చిప్స్, నైలాన్ ఫైబ‌ర్‌పై కూడా బేసిక్ క‌స్ట‌మ్స్ డ్యూటీని (Customs Duty) త‌గ్గించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. దీంతో నైలాన్ దుస్తుల ధ‌ర‌లు త‌గ్గే అవ‌కాశం ఉంది. మొబైల్ ఫోన్ల ధ‌ర‌లు, కార్ల విడిభాగాల ధ‌ర‌లు కూడా పెర‌గ‌నున్నాయి. సోలార్ ఇన్వ‌ర్ట‌ర్ల‌పై ప‌న్ను పెంపు, ఇంపోర్టెడ్ దుస్తులు మ‌రింత ప్రియం కానున్నాయి.

ఆరు మూల స్థంభాలతో బడ్జెట్, పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2021-22 ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, హైలెట్స్ పాయింట్స్ ఇవే..

ఇక క‌రోనా కార‌ణంగా ద్ర‌వ్య లోటు (Monetary deficit) భారీగా పెరిగింది. 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రానికి ద్ర‌వ్య లోటు ల‌క్ష్యం జీడీపీలో 3.5 శాతం కాగా.. అది కాస్తా 9.5 శాతానికి పెరిగిన‌ట్లు ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బ‌డ్జెట్ ప్ర‌సంగంలో వెల్ల‌డించారు. ఈ ద్ర‌వ్య లోటు 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రానికి 6.8 శాతంగా అంచ‌నా వేశారు.

రూ .16.5 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు, రైల్వేలకు రూ.1.10 లక్షల కోట్లు కేటాయింపు, కాలం తీరిన వాహనాలను తుక్కుగా మార్చే కొత్త పథకం, మరో కోటి మందికి ఉజ్వల పథకం, కేంద్ర బడ్జెట్ 2021-22 హెలెట్స్ ఇవే..

ఇక ట్యాక్స్ నుంచి ఎన్నారైలకు మినహాయింపు లభించింది. ట్యాక్స్‌ ఆడిట్‌ పరిమితి రూ.10 కోట్లకు పెంపు చేస్తున్నట్లు బడ్జెట్లో తెలిపారు. అక్టోబర్‌ 21 నుంచి కొత్త కస్టమ్స్‌ పాలసీ అమల్లోకి రానుంది. 400 రకాల పాతపన్ను మినహాయింపుల్లో సంస్కరణలు చేశారు. రాగిపై పన్ను మినహాయింపులు ఇచ్చారు. దిగుమతి చేసుకునే ప్రీమియం దుస్తులు మరింత ఖరీదు కానున్నాయి. లెదర్‌ ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి.

తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మొండి చేయి, బడ్జెట్లో కనపడని తెలుగు రాష్ట్రాల మెట్రో ఊసు, ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు పెద్ద పీఠ వేసిన నిర్మలమ్మ బడ్జెట్

వ్యవసాయ సెస్... మద్యం మీద 100% సెస్, బంగారం మరియు వెండి కడ్డీలపై 2.5%, ముడి పామాయిల్‌పై 17.5%, ముడి సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనె, ఆపిల్‌పై 35% మరియు బఠానీలపై 40% విధించింది. ఇది ఫిబ్రవరి 2 నుండి ఇది వర్తిస్తుంది. అయితే ఈ సెస్ వినియోగదారులను ప్రభావితం చేయదని సీతారామన్ అన్నారు. పెట్రోల్ మరియు డీజిల్‌పై వ్యవసాయ మౌలిక సదుపాయాలు మరియు అభివృద్ధి సెస్ (ఎఐడిసి) విధించడం, బేసిక్ ఎక్సైజ్ సుంకం (బిఇడి) మరియు స్పెషల్ అదనపు ఎక్సైజ్ డ్యూటీ (సాడ్) రేట్లు వాటిపై తగ్గించబడ్డాయి. సామాన్యులపై ఇది ఎలాంటి అదనపు భారాన్ని చూపదని ఆర్థికమంత్రి తెలిపారు.