Budget 2021 Highlights: ఆరు మూల స్థంభాలతో బడ్జెట్, పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2021-22 ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, హైలెట్స్ పాయింట్స్ ఇవే..
Nirmala-Sitharaman

New Delhi, Feb 1: కరోనావైరస్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. జనజీవితం తీవ్రంగా ప్రభావితమైంది. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే నూతన ఆర్థిక సంవత్సరానికి గానూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను (Budget 2021 Highlights) ప్రవేశపెడుతున్నారు. మూడోసారి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతున్నారు. ‘నెవర్‌ బిఫోర్‌’ బడ్జెట్‌ను ప్రకటించనున్నట్లు నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో వ్యవస్థలన్నీ 2021-22 బడ్జెట్‌పై (Budget 2021) భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్నాయి.

బ‌డ్జెట్ 2021లో భాగంగా ఆరు మూల స్తంభాల‌ను ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ (FM Nirmala Sitharaman) ప్ర‌క‌టించారు. ఇందులో మొద‌టిది ఆరోగ్యం, సంర‌క్ష‌ణ‌. రెండోది ఫిజిక‌ల్‌, ఫైనాన్షియ‌ల్ క్యాపిట‌ల్ అండ్ ఇన్‌ఫ్రా. మూడోది స‌మ్మిళిత వృద్ధి, నాలుగోది హ్యూమ‌న్ క్యాపిట‌ల్‌. ఐదోది ఇన్నోవేష‌న్ అండ్ రీసెర్చ్ & డెవ‌ల‌ప్‌మెంట్ (ఆర్ & డీ), ఆరోది క‌నిష్ఠ‌ ప్ర‌భుత్వం, గ‌రిష్ఠ పాల‌న‌. ఈ ఆరు మూల స్తంభాల‌పైనే బడ్జెట్‌ను రూపొందించిన‌ట్లు నిర్మ‌ల తెలిపారు. బడ్జెట్ హైలెట్ విషయాలను ఓ సారి పరిశీలిస్తే..

ఆరోగ్య భార‌త్ కోసం కేంద్ర ప్ర‌భుత్వం కొత్త స్కీమ్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ప్ర‌ధాన‌మంత్రి ఆత్మ‌నిర్బ‌ర్ స్వ‌స్త్ భార‌త్ యోజ‌న పేరుతో ఆ స్కీమ్‌ను అమ‌లు చేయ‌నున్నారు. ఈ కొత్త ప‌థ‌కం కోసం 64,180 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నారు. ఆరేళ్ల పాటు ఆ స్కీమ్ కోసం ఈ మొత్తాన్ని ఖ‌ర్చు చేస్తారు. ఆరోగ్యం విష‌యంలో కేంద్రం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకున్న‌ట్లు కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. లోక్‌స‌భ‌లో బ‌డ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ కొత్త స్కీమ్‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఆర్థిక మంత్రి వెల్ల‌డించారు.

ఈ స్కీమ్‌లో ఉన్న నిధుల‌తో ప్రైమ‌రీ, సెకండ‌రీ హెల్త్ కేర్ వ్య‌వ‌స్థ‌ల‌ను ప‌టిష్టం చేయ‌నున్న‌ట్లు ఆమె చెప్పారు. ప్ర‌స్తుతం ఉన్న జాతీయ సంస్థ‌ల‌ను బ‌లోపేతం చేయ‌డమే కాకుండా.. కొత్త ఆరోగ్య సంస్థ‌ల‌ను స్థాపించ‌నున్న‌ట్లు కేంద్ర మంత్రి సీతారామ‌న్ వెల్ల‌డించారు. కొత్త వ్యాధుల‌ను గుర్తించ‌డం, వాటికి చికిత్స‌ను ఇవ్వ‌డం వంటి ప‌రిశోధ‌న‌ల గురించి ఈ స్కీమ్ కింద నిధుల‌ను ఖ‌ర్చు చేయ‌నున్నారు. నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్‌కు తోడుగా ఈ స్కీమ్ ఉంటుంద‌న్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 17,788 సెంట‌ర్లు, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఉన్న 11,024 హెల్త్ అండ్ వెల్ నెస్ సెంట‌ర్ల‌ల‌కు చేయూత ఇవ్వ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. అన్ని జిల్లాల్లో హెల్త్ ల్యాబ్‌ల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోతో పాటు 20 మెట్రోపాలిట‌న్ హెల్త్ స‌ర్వియ‌లెన్స్ యూనిట్ల‌ను బ‌లోపేతం చేయ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. ఆరోగ్య స‌మాచారంతో ఓ ప్ర‌త్యేక పోర్ట‌ల్‌ను రూపొందించ‌నున్నార‌ని, దానితో అన్ని ప‌బ్లిక్ హెల్త్ ల్యాబ్‌ల‌ను అనుసంధానించ‌నున్న‌ట్లు చెప్పారు.

రోడ్డు రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి, ప్రజా రవాణాకు 2021-22 బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించామని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. రోడ్డు రవాణా, రహదారులకు రూ 1.18 లక్షల కోట్లు కేటాయించారు.రైల్వేలకు 1.10 లక్షల కోట్లు, ప్రజా రవాణాకు రూ. 18.000 కోట్లు కేటాయించామని బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ కోలుకునే దిశగా బడ్జెట్‌లో పలు చర్యలు చేపట్టామని వివరించారు.

దేశంలో ఏడు కొత్త టెక్స్‌టైల్ పార్క్‌ల‌ను డెవ‌ల‌ప్ చేయ‌నున్న‌ట్లు మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు.దేశవ్యాప్తంగా మ‌రిన్ని ఎక‌నామిక్ కారిడార్ల‌ను నిర్మించ‌నున్న‌ట్లు ఆమె చెప్పారు.  రోడ్డు మౌళిక‌స‌దుపాయాల‌ను పెంచేందుకు ఈ కారిడార్లు ప‌నిచేస్తాయ‌ని ఆమె తెలిపారు.రోడ్డు మౌళిక స‌దుపాయాల్లో భాగంగా.. త‌మిళ‌నాడులో 3500 కిలోమీట‌ర్ల మేర‌కు జాతీయ హైవే ప‌నులు చేప‌ట్ట‌నున్నారు. దీని కోసం సుమారు 1.03 ల‌క్ష కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నారు.  కేర‌ళ‌లో సుమారు 1100 కిలోమీట‌ర్ల హైవే ప‌నులు జ‌ర‌గ‌నున్నాయి. దీని కోసం 65వేల కోట్లు కేటాయించారు.  ప‌శ్చిమ బెంగాల్‌లోనూ 675 కిలోమీట‌ర్ల మేర హైవే ప‌నులు చేప‌ట్ట‌నున్నారు.  దీని కోసం 75 వేల కోట్లు కేటాయించారు.

కేంద్ర రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వ‌శాఖ‌కు ఈ ఏడాది ల‌క్షా 80 వేల కోట్ల బ‌డ్జెట్‌ను కేటాయించిన‌ట్లు మంత్రి సీతారామ‌న్ తెలిపారు.  త‌మిళ‌నాడులో రెండు హైవే కారిడార్ల‌ను నిర్మించ‌నున్నారు. ఆ ప‌నులు వ‌చ్చే ఏడాది ప్రారంభంకానున్న‌ట్లు ఆమె చెప్పారు. అస్సాంలోనూ 19000 కోట్ల హైవే ప‌నులు జ‌రుగుతున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు.

బడ్జెట్‌ లైవ్‌ అప్‌డేట్స్‌..

కోవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ కోసం 35వేల కోట్లు

మెగా ఇన్వెస్ట్‌మెంట్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌

ఆత్మనిర్భర భారత్‌ : రైతుల ఆదాయం రెట్టింపు

6 సంవత్సరాలకు గాను 64వేల 180కోట్లరూపాయలతో ఆత్మనిర్భర్‌ యోజన పేరుతో కొత్త పథకం

నేషనల్‌ డిసిజ్‌ కంట్రోల్‌ సిస్టం మరింత పటిష్టం ,దేశ వ్యాప్తంగా 15 ఎమర్జెన్సీ సెంటర్లు

మూడోసారి బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్‌

ప్రధాని మోదీ హయాంలో 9వ బడ్జెట్‌, బడ్జెట్‌ యాప్‌ రిలీజ్‌ చేసిన కేంద్రం

అనేక సంక్షోభాలను ఎదుర్కొని ఆర్థిక వ్యవస్థను బాగుచేశాం

లాక్‌డౌన్‌ సందర్భంగా లక్షలాది మందికి ఉచితంగా ధాన్యంఇచ్చాం

టీమిండియా అద్భుత విజయాన్ని ప్రస్తావన

ఘ‌న వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ కోసం స్వ‌చ్ఛ‌భార‌త్ అర్బ‌న్‌

ఐదేళ్ల‌లో స్వ‌చ్ఛ‌భార‌త్ అర్బ‌న్ కోసం రూ. 1,41,670 కోట్లు

జల జీవన్‌ మిషన్‌కు రూ. 2,87,000 కోట్లు కేటాయింపు

దేశంలోని వాహ‌నాల ఫిట్‌నెస్ ప‌రీక్ష‌కు ప్ర‌త్యేక విధానం

వ్య‌క్తిగ‌త వాహ‌నాల‌కు 20 ఏండ్లు, వాణిజ్య వాహ‌నాల‌కు 15 ఏండ్లు

కాల‌ప‌రిమితి ముగిసిన త‌ర్వాత ఫిట్‌నెస్ ప‌రీక్ష‌కు వెళ్లాల‌ని నిబంధ‌న‌

తుక్కు వాహ‌నాల ర‌ద్దు, అధునాత‌న వాహ‌నాల వినియోగం

15 ఏండ్లు దాటిన వాణిజ్య వాహ‌నాల‌ను తుక్కు కింద మార్చే ప‌థ‌కం

ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ర‌క్షిత మంచినీటి కోసం ప్ర‌ధాని జ‌ల్‌జీవ‌న్ మిష‌న్ అర్బ‌న్‌

ర‌క్షిత మంచినీటి ప‌థ‌కాల కోసం రూ. 87 వేల కోట్లు

రూ. 87 వేల కోట్ల‌తో 500 న‌గ‌రాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలు

కొత్త‌గా 9 బీఎస్ఎల్ -3 స్థాయి ప్ర‌యోగ‌శాల‌లు

15 అత్య‌వ‌స‌ర ఆరోగ్య కేంద్రాలు

ప్ర‌పంచ దేశాల‌కు భార‌త్ ఓ ఆశాకిర‌ణంగా కనిపిస్తోంది

ఆర్థిక వ్య‌వ‌స్థ చరిత్ర‌లో మూడుసార్లు మాత్ర‌మే జీడీపీ మైన‌స్‌లో ఉంది

100 దేశాల‌కు క‌రోనా టీకాను స‌ర‌ఫ‌రా చేస్తున్నాం

కొవిడ్ నివార‌ణ‌లో ప్రపంచానికి దిక్సూచిగా నిలిచాం

భార‌త్‌లో రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వ‌చ్చాయి

మ‌రో రెండు కొత్త వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి

ఎకాన‌మీ పున‌రుజ్జీవానికి అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల‌న్నీ ఈ బ‌డ్జెట్‌లో ఉన్నాయి

క‌రోనాపై యుద్ధం కొన‌సాగుతుంది

ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ ఆద‌ర్శం కొత్త‌ది కాదు

ఈ దేశం మూలాల్లోనే ఆత్మ‌నిర్భ‌ర్ భావం ఉంది

ప్ర‌పంచ యుద్ధాల త‌ర్వాత ఆర్థిక‌, సామాజిక రంగాల్లో ప్ర‌పంచం మారింది

ఇప్పుడు క‌రోనా త‌ర్వాత కూడా మ‌నం మ‌రో కొత్త ప్ర‌పంచంలో ఉన్నాం

లాక్‌డౌన్ వ‌ల్ల అనేక స‌వాళ్ల‌ను ఎదుర్కోవాల్సి వ‌చ్చింది

క‌నీవినీ ఎరుగ‌ని ప‌రిస్థితుల్లో ఈ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెడుతున్నాం

కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన ఆత్మ నిర్భ‌ర్ ప్యాకేజీలు లాక్‌డౌన్ క‌ష్టాల‌ను కొంత వ‌ర‌కూ త‌గ్గించాయి

ఐదు ప్యాకేజీలు ఐదు బ‌డ్జెట్‌ల‌తో స‌మానం

విద్యుత్‌, వైద్యారోగ్యం, బ్యాంకింగ్‌, అగ్నిమాప‌క రంగాల్లో త‌మ ప్రాణాలొడ్డి ప‌ని చేశారు

లాక్‌డౌన్ పెట్ట‌క‌పోయి ఉంటే భార‌త్ భారీ న‌ష్టాన్ని చ‌విచూడాల్సి వ‌చ్చేది

దేశ చ‌రిత్ర‌లో తొలిసారిగా కేంద్ర బడ్జెట్ పేప‌ర్‌లెస్‌గా మారింది.

ఈ ఏడాదికి సంబంధించిన బ‌డ్జెట్‌ను ట్యాబ్‌లో పొందుప‌రిచారు.

ఎర్ర‌టి బ్యాగులో ఐప్యాడ్ ట్యాబ్లెట్‌తో మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ క‌నిపించారు.

మంత్రులు నిర్మాలా సీతారామన్‌, అనురాగ్‌ ఠాగూర్‌ సోమవారం ఉదయం ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి బయల్దేరి రాష్ట్రపతి కార్యాలయంలో ప్రెసిడెంట్‌ రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. రాష్ట్రపతికి బడ్జెట్‌ ప్రతిని అందజేశారు. అనంతరం పార్లమెంట్‌కు బయలుదేరారు. మేడ్‌ఇన్‌ ఇండియా బహీ ఖాతా ఎర్ర రంగు ట్యాబ్‌తో నిర్మలా సీతారామన్‌, అనురాగ్‌ఠాకూర్‌, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పార్లమెంటుకు చేరున్నారు. మరోవైపు కేంద్ర మంత్రులు హర్షవర్ధన్‌, అమిత్‌ షా కూడా పార్లమెంట్‌కు హాజరయ్యారు.