SC on Marital Rape: వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేం, సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం, సమాజంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని వెల్లడి
ఇది సమాజంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని వెల్లడించింది
New Delhi, Oct 3: వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.ఇప్పటికే తగినన్ని శిక్షలు ఉన్నాయని, కానీ ఇది మాత్రం చట్టబద్దమైన అంశానికి మించిన సామాజిక సమస్య అని పేర్కొంది. ఇది సమాజంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని వెల్లడించింది.వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించడం సుప్రీం కోర్టు పరిధిలో లేదని కేంద్రం తెలిపింది.
వైవాహిక అత్యాచారం అనేది చట్టబద్ధమైన సమస్య కంటే సామాజిక సమస్య అని, ఇది సమాజంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని కేంద్రం పేర్కొంది. అన్ని భాగస్వామ్య పక్షాలతో సరైన సంప్రదింపులు లేకుండా లేదా అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఈ సమస్యను (వైవాహిక అత్యాచారం) నిర్ణయించలేమని కేంద్రం తెలిపింది.ఈ మేరకు సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది.
వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను కేంద్రం వ్యతిరేకించింది. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలోకి రాదని వెల్లడించింది. కేంద్రం, అన్ని రాష్ట్రాలు, ఇతర భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా దీనిపై ఓ నిర్ణయం తీసుకోలేమని వెల్లడించింది.