Sexual Harassment: ఐసోలేషన్ వార్డులో లైంగిక దాడి, కరోనా సోకిన మహిళపై మరో కరోనా సోకిన డాక్టర్ అసభ్య ప్రవర్తన, నోయిడాలో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు
దేశంలో లైంగిక వేధింపులు ఏదో ఓ చోట వినిపిస్తూనే ఉన్నాయి. చివరకు కరోనా సోకిన వారికి కూడా కామాంధుల వేధింపులు ఆగడం లేదు. కరోనా సోకిన మహిళపై సాటి కరోనా రోగి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన నోయిడాలో (Noida Molested Incident) చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. నోయిడాలో కరోనావైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న యువతిపై (Covid patient) అదే వార్డులో కరోనా సోకిన డాక్టర్ (Covid doctor) అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఐసోలేషన్ వార్డులో ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

New Delhi, July 28: దేశంలో లైంగిక వేధింపులు ఏదో ఓ చోట వినిపిస్తూనే ఉన్నాయి. చివరకు కరోనా సోకిన వారికి కూడా కామాంధుల వేధింపులు ఆగడం లేదు. కరోనా సోకిన మహిళపై సాటి కరోనా రోగి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన నోయిడాలో (Noida Molested Incident) చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. నోయిడాలో కరోనావైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న యువతిపై (Covid patient) అదే వార్డులో కరోనా సోకిన డాక్టర్ (Covid doctor) అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఐసోలేషన్ వార్డులో ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వికారాబాద్‌లో దారుణం, మహిళను చంపి తగులబెట్టేశారు, మృతదేహం వద్ద మద్యం సీసాలు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న తెలంగాణ పోలీసులు
ఇరవై ఏళ్ల యువతికి ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో ఆమె నోయిడాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. ఈ క్రమంలో కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందిస్తున్న డాక్టర్‌కు సైతం మహమ్మారి సోకగా... బాధితురాలితో కలిపి అతడిని ఒకే ఐసోలేషన్ వార్డులో ఉంచారు. ఈ నేపథ్యంలో సదరు డాక్టర్ సోమవారం తనను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం గురించి అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ.. ఈ ఘటనకు ఆస్పత్రి యాజమాన్య వ్యవహార శైలి కూడా కారణమని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ఇద్దరు కోవిడ్ పేషెంట్లను ఒకే వార్డులో ఉంచి సేవలు అందించినందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. బాధితురాలి ఫిర్యాదుకు తాము సత్వరమే స్పందించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. నిందితుడు ప్రస్తుతం ఆస్పత్రిలోనే ఉన్నాడని, కోవిడ్ నిబంధనల ప్రకారం అతడి వాంగ్మూలం నమోదు చేస్తామని నోయిడా అదనపు డిప్యూటీ కమిషనర్ రన్ విజయ్ సింగ్ పేర్కొన్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)