Representational Image (Photo Credits: Pixabay)

Vikarabad, July 28: తెలంగాణలో వికారాబాద్ జిల్లాలో (Vikarabad District) దారుణ ఘటన చోటుచేసుకుంది. పూడురు మండలం సోమన్‌ గుర్తి సమీపంలో సోమవారం గుర్తు తెలియని మహిళ శవం లభ్యమైంది. మహిళను గుర్తుపట్టకుండా దుండగులు మృతదేహాన్ని నిప్పుతో (Woman Burned in Vikarabad) తగులబెట్టారు. గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికకు మత్తు మందు ఇచ్చి ఏడు మంది గ్యాంగ్ రేప్, 12మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, నిందితుల్లో ఇద్దరికీ కరోనా పాజిటివ్

వివరాల్లోకెళితే.. వికారాబాద్ జిల్లాలోని పూడూరు (Pudur zone) మండలం సోమన్‌గుర్తి (Somangurthy village) గ్రామ సమీపంలో 167వ నంబర్ జాతీయ రహదారి వెంబడి, స్టీల్ ఫ్యాక్టరీ సమీపంలో రహదారికి ఆనుకుని సెక్యూరిటీ పోస్టు కోసం నిర్మించిన గదిలో సగం కాలిపోయిన గుర్తు తెలియని మహిళ శవం (35) లభ్యమైంది. మహిళని హత్య చేసిన దుండగులు.. ఆమె మృతదేహాన్ని గుర్తుపట్టకుండా ఉండేందుకు తగలబెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మహిళను కర్రతో దాడి చేసి, రాయితో మోది హత్య చేశారని.. ఆమె ఆనవాళ్లు తెలియకూడదన్న ఉద్దేశంతో నిప్పుపెట్టి తగలబెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మహళ మృతదేహం వద్ద మద్యం బాటిళ్లు, వాటర్ బాటిల్ రక్తపు మరకలతో ఉన్న కర్ర లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీం,డాగ్ స్క్వాడ్‌ను పిలిపించి సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు. హత్యకు గురైన మహిళ ఎవరు? ఎందుకు హత్య చేశారు? తదితర విషయాలు పోలీసు విచారణలో తేలాల్సి ఉంది.

మృతదేహానికి సమీపంలో ఆంధ్రప్రదేశ్‌‌లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణానికి చెందిన ప్రైవేటు స్కూల్ అడ్రస్ రాసి ఉన్న హ్యాండ్ బ్యాగ్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కాళ్లకు మెట్టెలు ధరించి ఉండటంతో ఆమె వివాహితురాలని నిర్ధారించారు. దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడి, ఆపై హత్య చేసి దహనం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.