Odisha Lockdown: నేటి నుంచి 14 రోజుల పాటు లాక్‌డౌన్, కీలక నిర్ణయం తీసుకున్న ఒడిశా ప్రభుత్వం, కఠిన ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించిన సీఎం నవీన్ పట్నాయక్

తాజాగా ఒడిశా కూడా లాక్ డౌన్ ప్రకటించింది. ఒడిశాలోనూ రోజూ 5 వేలకు పైగా కేసులు నమోదవుతుండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వమూ లాక్ డౌన్ ను విధించింది. ఇవ్వాళ్టి నుంచి మే 19 వరకు 14 రోజుల పాటు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని నవీన్ పట్నాయక్ సర్కార్ ప్రకటించింది.

Odisha announces Rs 50 lakh for kin of health & support staff who die treating Covid-19 (Photo-Facebook)

Bhuvaneshwar, May 2: కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కేసులను నియంత్రించేందుకు పలు రాష్టాలు లాక్‌డౌన్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి. తాజాగా ఒడిశా కూడా లాక్ డౌన్ ప్రకటించింది. ఒడిశాలోనూ రోజూ 5 వేలకు పైగా కేసులు నమోదవుతుండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వమూ లాక్ డౌన్ ను విధించింది. ఇవ్వాళ్టి నుంచి మే 19 వరకు 14 రోజుల పాటు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని నవీన్ పట్నాయక్ సర్కార్ ప్రకటించింది.

కఠిన ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించింది. ప్రజలు బయటకు రావొద్దని సూచించింది. ప్రజా రవాణా వ్యవస్థనూ బంద్ పెడుతున్నట్టు స్పష్టం చేసింది. నిత్యవసరాలను కొనుగోలు చేసేందుకు మాత్రం అనుమతినిచ్చింది. అయితే, దానికి ఓ షరతు పెట్టింది.

ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపే ఏది కావాలన్నా కొనుగోలు చేయాలని సూచించింది. అది కూడా అర కిలోమీటరు దూరంలోపున్న షాపులు లేదా కూరగాయల దుకాణాలకే నడుచుకుంటూ వెళ్లాలని తెలిపింది. వైద్య సేవలు, నిత్యావసర సేవలు అందించే వాహనాలపై ఎలాంటి ఆంక్షలూ ఉండబోవని పేర్కొంది.

దేశంలో రోజు రొజుకు పెరుగుతున్న కరోనా మరణాలు, తాజాగా 3689 మంది మృతి, గత 24 గంటల్లో 3,92,488 మందికి కోవిడ్, 18 నుంచి 44 సంవత్సరాల వయసు ఉన్నవారికి టీకా ఇవ్వాలని కేంద్రం నిర్ణయం

రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 8,015 కొత్త కేసులు నమోదవగా, 14 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,62,622కు పెరిగింది. మొత్తంగా 2,068 మంది చనిపోయారు. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటకల్లో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.