Terror of Red Ant: చీమల భయంతో ఊరు ఖాళీ చేసిన ప్రజలు, ఒడిషాలో జనాలను పరిగెత్తిస్తున్న ఎర్రచీమల దండు, రాణి చీమ కోసం శాస్త్రవేత్తల వెతుకులాట

ఈ నదికి గ్రామానికి మధ్య అడవి ఉంది. ఆ నదికి వరద రావడంతో అడవి, పొదల్లోని చీమలు గ్రామంలోకి వచ్చేశాయని..గ్రామంలోనే నివాసం ఏర్పర్చుకున్నాయని తెలిపారు. చీమలు ఎక్కడి నుంచి గ్రామంలోకి ప్రవేశిస్తున్నాయనేది గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని.. ఆ మూల కేంద్రంలో రాణి చీమలు ఉంటాయని..వాటిని చంపేస్తే ఈ చీమల సమస్య తొలగిపోతుందన్నారు

Bhuvaneswar, SEP 08: ఎర్ర చీమ..చూట్టానికి నలకంత ఉంటుంది. కానీ అదికుడితే ఉంటది మంటా..మామూలుగా ఉండదు. దెబ్బకు దద్దుర్లు రావాల్సిందే. ఆరు అడుగుల మనిషి అయినా అబ్బా అనాల్సిందే. ఒక్కచీమ కుడితేనే మంటెత్తిపోతుంది. ఇంట్లో నాలుగు చీమలు (Ants)కనిపిస్తే చాలు ఏదోక రసాయనం వేసి చంపేస్తాం. అవే చీమలు గుట్టలు గుట్టలుగా ఓ ఉరినే కమ్మేస్తే… ఎక్కడ చూసినా చీమలే. కుట్టి కుట్టి జనాల్ని నరకయాతనకు గురిచేస్తే..ఇక పరిస్థితి ఊహించనంత బాధగా..భయంకరంగా ఉంటుంది. అలా చీమల దెబ్బకు ఊరంతా ఖాళీ చేసి వలసపోయారు గ్రామస్తులు. ఎర్ర చీమలు (Red ants) కుట్టి కుట్టి ఒళ్లంతా మంటెక్కించే ఇరిటేట్ చేసేస్తున్నాయి. ఇళ్లు, రోడ్లు, పొలాలు, చెట్లు, చేమలు..ఒకటేంటి ఇలా ఎక్కడ చూసినా ఎర్ర చీమలే. గుట్టలు గుట్టలుగా దండెత్తాయి ఓ గ్రామంమీద. దీంతో ఆ చీమల దెబ్బకు ఏంగా ఊరు ఊరంతా ఖాళీ చేసి వెళ్లిపోయారు గ్రామస్తులు. ఈ చీమల పీడ విరగడ అయితే వస్తామంటున్నారు. అడుగు పెడితే కుట్టేస్తుండటంతో ఊరు ఊరంతా గగ్గోలు పెట్టింది. చివరికి ఊరి వాళ్లంతా అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇటువంటి వింత పరిస్థితి ఒడిశా (odisha) రాష్ట్రంలోని పూరి జిల్లా పిప్లి (pipli) తాలూకా బ్రహ్మంసాహి గ్రామస్తులకు వచ్చింది.

ఒడిశాలోని పూరి జిల్లా పిప్లి తాలూకా బ్రహ్మంసాహి గ్రామంలో రెండు నెలల కిందట ఎర్ర చీమల బెడద మొదలైంది. ఏదో చీమలు అన్నాక కుట్టవా? అని సరిపెట్టుకుంటుంటే వాటి సమస్య మరీ పెరిగిపోయింది. వటుడు ఇంతై అన్నట్లుగా ఎక్కడ చూసినా ఎర్ర చీమలే. ఆ చీమలు మెల్లమెల్లగా పెరిగి ఊరంతా చీమలమయంగా మారింది. గ్రామస్థులు ఈ చీమల బాధ తట్టుకోలేక ఊరు విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఇదే ప్రాంతానికి చెందిన చంద్రదేయిపూర్ గ్రామానికి కూడా చీమల ముప్పు మొదలైంది. ఈ సమస్య ఎంతగా పెరిగి పెద్దది అయ్యిదంటే ఏకంగా ప్రజలు ప్రభుత్వ అధికారులకు మొరపెట్టుకోవాల్సివచ్చింది. అధికారులు ఏంటీ చీమలతో ఇంత సమస్యా..అని ఆశ్చర్యపోయారు. ఇదేదో తెలుసుకోవాల్సిందనని గ్రామాన్ని పరిశీలించగా అసలువిషయం అర్థం అయి చర్యలు తీసుకునేపని పట్టారు. ప్రభుత్వ అధికారులు గ్రామాన్ని పరిశీలించారు. అంతేకాదు ఈ చీమల దెబ్బకు ఏకంగా ఒడిశా అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, అధికారులు కదిలి వచ్చారు. గ్రామాన్ని పరిశీలించి చీమల బెడదను తొలగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఈ చీమల దెబ్బకు హడలిపోతున్న గ్రామస్తులు..చీమలతో తలనొప్పే కాదు పెద్ద సమస్యే వచ్చిపండింది. ప్రశాంతంగా కనీసం కంటినిండా నిద్రపోలేకపోతున్నామని..తిండికూడా తినలేకపోతున్నామని వాపోతున్నారు.కనీసం ఎక్కడైనా కూర్చోలేని పరిస్థితి. పిల్లలు బడికి కూడా వెళ్లడం లేదు. అందుకే ఊరు వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాం..” అని తెలిపారు.

Karnataka: ఈ పాపం ఎవరిది, ఆస్పత్రిలో పసికందును పీక్కు తిన్న కుక్కలు, చికిత్స పొందుతూ చిన్నారి మృతి, తల్లిదండ్రులెవరో ఇక్కడ పడేసి వెళ్లారని చెబుతున్న వైద్యులు 

బ్రహ్మంసాహి గ్రామానికి వచ్చిన చీమల సమస్య గురించి ఒడిశా అగ్రికల్చర్ వర్సిటీ శాస్త్రవేత్త సంజయ్ మహంతి మాట్లాడుతూ..ఈ గ్రామానికి కొంచెం దూరంలో ఓ నది ఉంది. ఈ నదికి గ్రామానికి మధ్య అడవి ఉంది. ఆ నదికి వరద రావడంతో అడవి, పొదల్లోని చీమలు గ్రామంలోకి వచ్చేశాయని..గ్రామంలోనే నివాసం ఏర్పర్చుకున్నాయని తెలిపారు. చీమలు ఎక్కడి నుంచి గ్రామంలోకి ప్రవేశిస్తున్నాయనేది గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని.. ఆ మూల కేంద్రంలో రాణి చీమలు ఉంటాయని..వాటిని చంపేస్తే ఈ చీమల సమస్య తొలగిపోతుందని తాము ఈ రాణీ చీమల జాడ కోసం వెతుకుతున్నామని తెలిపారు. ప్రస్తుతానికి ఊరి చుట్టూ పొదల్లో చీమల మందు చల్లుతున్నామని తెలిపారు. కాగా ఇంతకు ముందు 2013లో ఫాలిన్ తుపాను సమయంలో పూరి జిల్లాలోని దండ గ్రామంపై ఇలా చీమలు దాడి చేసిన ఘటన నమోదైంది.

Expensive Whale Vomit: తిమింగలం వాంతి అమ్ముతుండగా పట్టుకున్న యూపీ పోలీసులు, నాలుగు కిలోల తిమింగలం వాంతి రూ. 10 కోట్లు, బంగారం కంటే ఎక్కువ ధర పలికే తిమింగలం వ్యర్ధాలు, ఇంతకీ తిమింగలం వాంతికి ఎందుకంత డిమాండ్, దాంతో ఏం చేస్తారో తెలుసా? 

మరోవైపు తమిళనాడులోని అటవీ ప్రాంతాల్లో పలు గ్రామాల్లో చీమలు గుంపులుగా వచ్చి దండయాత్ర చేస్తున్నాయి. రాష్ట్రంలోని కరంతమలై రిజర్వ్ ఫారెస్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో ‘ఎల్లో క్రేజీ యాంట్స్’ అనే చీమలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సన్నగా, చిన్నగా ఉండే ఈ చీమలు చాలా చురుగ్గా కదులుతాయి. ఈ చీమల దాటికి తట్టుకోలేక ప్రజలు గ్రామాలను ఖాళీచేసి వెళ్లిపోతున్నారు. తమిళనాడులోని దిండుక్కల్ జిల్లా కరంతమలై రిర్వ్ ఫారెస్ట్ పరిసర ప్రాంతాల్లో ఏడు గ్రామాలపై ఈ ఎల్లో క్రేజీ యాంట్స్ తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ ప్రాంతాల్లో చాలా మంది వ్యవసాయం, పశువుల పెంపకంను జీవనోపాధిగా చేసుకొని జీవిస్తున్నారు. అయితే ఈ చీమల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అక్కడి ప్రజలు వాపోతున్నారు. అడవి దగ్గరికి వెళ్లగానే చీమలు మనపైకి ఎక్కిచికాకు చేస్తాయని, వీటి కారణంగా పొక్కులు వస్తున్నాయని స్థానికులు తెలిపారు. అవి ఒక్కసారిగా గుంపులుగా వస్తుండటంతో తాగేందుకు నీళ్లు కూడా తీసుకెళ్లలేక పోతున్నామని, ఏం చేయాలో తోచడం లేదని అక్కడి ప్రజలు పేర్కొంటున్నారు. గత కొన్నేళ్లుగా అడవిలో ఈ చీమలు చూస్తున్నామని, అయితే జనజీవనాన్ని అస్తవ్యస్తంచేస్తూ గ్రామాల్లో ఇంత పెద్ద సంఖ్యలో కనిపించడం ఇదే తొలిసారని స్థానికులు పేర్కొంటున్నారు. కొందరు గ్రామస్తులు చీమల గుంపు దాడిని తట్టుకోలేక గ్రామాల్లోని ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif