Odisha Shocker: బర్త్‌డే పార్టీలో సౌండ్ ఆపమన్నందుకు మహిళపై ముగ్గురు సామూహిక అత్యాచారం, రూంలోకి లాక్కెళ్లి ఒకరి తర్వాత ఒకరు వంతులు వారీగా గ్యాంగ్ రేప్, ఒడిశాలో దారుణ ఘటన

భువనేశ్వర్‌లో పుట్టినరోజు వేడుకల్లో సౌండ్ వస్తుందని అభ్యంతరం చెప్పినందుకు (Objecting to Noise During Birthday Party ) ఓ మహిళపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి (Woman Gang-Raped)పాల్పడ్డారు.

Man thrashes wife for failing to conceive a child (Representational: Getty)

Bhubaneswar, Dec 14: భువనేశ్వర్‌లో పుట్టినరోజు వేడుకల్లో సౌండ్ వస్తుందని అభ్యంతరం చెప్పినందుకు (Objecting to Noise During Birthday Party ) ఓ మహిళపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి (Woman Gang-Raped)పాల్పడ్డారు.

డిసెంబరు 11 (ఆదివారం) మంచేశ్వర్ పోలీసు పరిధిలో జరిగిన ఈ సంఘటన సోమవారం బాధితురాలు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. సోమవారం మంచేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు ఐపిసిలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ముగ్గురు నిందితులను అరెస్టు (Three Arrested) చేసినట్లు కళింగటివి నివేదించింది.

ముసలోడు కాదు కామాంధుడు, జ్యూస్ ఇస్తా రమ్మంటూ బాలికను ఇంట్లోకి తీసుకువెళ్లాడు, మత్తు మందు ఇచ్చి సాయంత్రం వరకు దారుణంగా రేప్, విషయం తెలిసి అతన్ని కొట్టి చంపిన బాలిక తల్లిదండ్రులు

నిందితులను దేబాషిస్ ప్రధాన్ (24), దీపక్ కుమార్ సేథీ (24), స్వాధీన్ కుమార్ నాయక్ (22)లుగా గుర్తించారు. డిసెంబర్ 11 సాయంత్రం దీపక్ తన పుట్టినరోజును పురస్కరించుకుని పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు పార్టీలొ పెద్ద సౌండ్ తో డీజే ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతంలో నివసించే వారు అభ్యంతరం తెలిపారు. అయితే, ఫిర్యాదుపై ఆగ్రహించిన నిందితులు ముగ్గురూ మహిళను ఓ ఇంట్లోకి లాగి వంతులవారీగా అత్యాచారానికి పాల్పడ్డారు.

మియాపూర్‌లో మరో దారుణం, మాట్లాడటం లేదని ప్రియురాలిని కత్తితో పొడిచిన యువకుడు, అనంతరం గొంతు కోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం

ఆ సమయంలో మహిళ భర్త ఇంట్లో లేడు. బాధితురాలు సహాయం కోసం కేకలు వేయడంతో కొందరు ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని నిందితుల బారి నుంచి ఆమెను రక్షించారు. అయితే, అక్కడి నుంచి వెళ్లే ముందు నిందితులు ముగ్గురూ బాధితురాలిని చంపేస్తామని బెదిరించినట్లు సమాచారం. బాధితురాలు, ఆమె భర్త నిందితులు మరియు వారి సహచరులు కొందరిపై మంచేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ఫిర్యాదు మేరకు ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.