IPL Auction 2025 Live

Woman Lives In Toilet: మరుగుదొడ్డే ఆమె నివాసం, నలుగురు కూతుర్లకు అది ఎంతవరకు రక్షణ ఇస్తుంది ?, ఒడిశాలో ఓ మహిళ ఆవేదన, మేము ఏమీ చేయలేమంటున్న సర్పంచ్

నాయకుల హామీల మూటలు పేపర్లకే పరిమితమవుతున్నాయి. కనీసం కూడు గూడు అనేవి కూడా వారికి గగనం అయ్యే పరిస్థితులు కళ్ళముందు కదలాడుతున్నాయనే దానికి ఈ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. ఒడిశా(odisha)లోని ఒక గిరిజన మహిళ (tribal woman)ఉండటానికి ఇల్లు లేక, కొనేందుకు డబ్బులు లేకపోవడంత మూడేళ్లపాటు మరుగుదొడ్డిలోనే కాలం వెళ్లదీస్తోంది.

odisha-unable-to-afford-house-72-year-old-tribal-woman-lives-in-toilet-for-3-years-in-mayurbhanj (Photo-ANI)

Bhubaneswar, December 10: దేశం ఆర్థికంగా ముందుకు వెళుతున్నా సామాన్యలు జీవితాల్లో ఎటువంటి మార్పు కానరావడం లేదు. నాయకుల హామీల మూటలు పేపర్లకే పరిమితమవుతున్నాయి. కనీసం కూడు గూడు అనేవి కూడా వారికి గగనం అయ్యే పరిస్థితులు కళ్ళముందు కదలాడుతున్నాయనే దానికి ఈ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. ఒడిశా(odisha)లోని ఒక గిరిజన మహిళ (tribal woman)ఉండటానికి ఇల్లు లేక, కొనేందుకు డబ్బులు లేకపోవడంత మూడేళ్లపాటు మరుగుదొడ్డిలోనే కాలం వెళ్లదీస్తోంది.

ఒడిశాలోని మయూరభంజ్ జిల్లాలోని గ్రామంలో ఉంటున్న ద్రౌపది బెహెరా (Draupadi Behera )అనే 72 ఏళ్ల మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి స్వచ్ఛ భారత్ కోసం నిర్మించిన మరుగుదొడ్డిలో ఉంటోంది. ఈ విషయాన్ని ANI వెలుగులోకి తీసుకువచ్చింది.

Here's the tweet:

భర్త మరణించిన తరువాత ద్రౌపది అత్యంత పేదరికంతో తన నలుగురు కుమార్తెలతో కలిసి టాయిలెట్ లోను జీవించాల్సిన దుర్భర దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. దేశంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరగుతున్న ఈ క్రమంలో తన ఆడబిడ్డలకు ఈ మరుగుదొడ్డి ఎంతవరకూ రక్షణనిస్తుంది అనే ఆందోళనలో వేరే దారి లేక..ఉండటానికి గూడు లేక మరుగుదొడ్డిలోనే జీవించాల్సిన దుర్భరపరిస్థితిలో కాలం వెళ్లదీస్తోంది.

ఇంత భయంకరమైన స్థితిలో ఉన్న ఆమెపై గ్రామానికి చెందిన సర్పంచ్ అని బుధురామ్ పుటీ (Budhuram Puty) మాట్లాడుతూ ఆమె పరిస్థితి చాలా దారుణమైనదనీ..ఆమెకు ఓ ఇల్లు నిర్మించేంత పరిస్థితి తమ పంచాయితీకి లేదనీ ప్రభుత్వ పథకాల ద్వారా ఒక ఇల్లు సాంక్షన్ అయితే చాలా సంతోషిస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే జూలైలో ఒడిశా నుండి ఇలాంటి మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. సైక్లోన్ ప్రభావంతో సర్వం కోల్పోయిన ఓ వ్యక్తి ఇద్దరు కూతుర్లతో మరుగుదొడ్డిలో నివాసం ఉంటున్నానని తెలిపారు.