Sabarimala Veridct: నిఘా నీడలో శబరిమల, తీర్పు నేపథ్యంలో 10 వేలమంది పోలీసులతో పహారా, అయిదు దశల్లో పోలీసు బలగాల తరలింపు, 16న తెరుచుకోనున్న ఆలయ తలుపులు

అయితే సుప్రీంకోర్టు తీర్పు (Sabarimala Veridct)పై అయ్యప్ప భక్తులు, హిందువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. మహిళలను శబరిమలలో ప్రవేశించకుండా అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

Over 10,000 cops to be deployed in Sabarimala for Mandala Pooja (Photo-ANI)

Sabarimala, November 13: కేరళలోని ప్రముఖ అయ్యప్ప స్వామి ఆలయం శబరిమల(Sabarimala)లోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ గతేడాది సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు తీర్పు (Sabarimala Veridct)పై అయ్యప్ప భక్తులు, హిందువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. మహిళలను శబరిమలలో ప్రవేశించకుండా అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

దీంతో రివ్యూ పిటిషన్‌కు సుప్రీంకోర్టు (Suprim court)అనుమతించింది. దీనిపై మొత్తం 56 పిటిషన్ల దాఖలు కాగా, చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని జస్టిస్ రోహిటన్ నారిమన్, ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హొత్రాలతో కూడి ధర్మాసనం ధర్మాసనం గురువారం ఉదయం 10.30 గంటలకు తీర్పు(Sabarimala Veridct) వెలువరించనుంది.

శబరిమల ఆలయం

ఈ నేపథ్యంలో సుమారు 10 వేలమంది పోలీసులను దశలవారీగా అక్కడికి తరలించడానికి రంగం సిధ్దమైంది. ఈ నెల 16 నుంచి రెండు నెలల పాటు ‘ మండల మకర విళక్కు ‘ ఉత్సవాలు (Sabarimala for Mandala Pooja) జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా ఈ సారి అలాంటి పరిస్థితిని నివారించేందుకు అయిదు దశలుగా పోలీసు బలగాలను తరలిస్తున్నారు. ఈ నెల 16 న భక్తులకు ఆలయ తలుపులు తెరవనున్నారు.

అక్టోబర్ నెలలో సేవ్ శబరిమల అంటూ కర్ణాటకలో ధర్నా

మొత్తం 24 మంది పోలీసు అధికారులు ఇక్కడ డ్యూటీలు నిర్వహించనున్నారు. ఎస్‌పీ, ఏఎస్పీ, DySP, 264 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, 1,185 Sub Inspector/ Assistant Sub Inspectors పహారా కాయనున్నారు. మొత్తం 8402 సివిల్ సప్లయి పోలీసుల అధికారులు డ్యూటీలో ఉండనున్నారు. వీరిలో 307 మంది మహిళా పోలీసులు ఉన్నారు. మొదటి ఫేజ్‌లో 2,551 ఆఫీసర్లు, రెండవ ఫేజ్‌లో 2,539 మంది, మూడవఫేజ్‌లో2992 మంది నాలుగవ ఫేజ్‌లో 3077మందిని అక్కడికి తరలించనున్నారు. అదనంగా స్పెషల్ బ్రాంచీ నుంచి 1560 మంది పోలీసుల తమ విధులను నిర్వహించనున్నారు.