Pakistan Hands Over BSF Jawan: దట్టమైన పొగమంచు, అనుకోకుండా పాక్ భూబాగంలోకి వెళ్లిపోయిన భారత జవాన్, అరెస్ట్ చేసిన పాకిస్తాన్ ఆర్మీ అధికారులు, అత్యవసర సంప్రదింపులు తర్వాత జవాన్ విడుదల
పంజాబ్ సెక్టార్‌లో గురువారం ఉదయం అనుకోకుండా పాకిస్తాన్ వైపు (accidentally crossed border) దాటిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్) జవాన్‌ను భారత అధికారులకు అప్పగించినట్ (Pakistan Hands Over BSF Jawan)లు ఫోర్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
Punjab, Dec 1: పంజాబ్ సెక్టార్‌లో గురువారం ఉదయం అనుకోకుండా పాకిస్తాన్ వైపు (accidentally crossed border) దాటిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్) జవాన్‌ను భారత అధికారులకు అప్పగించినట్ (Pakistan Hands Over BSF Jawan)లు ఫోర్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు. పంజాబ్ సెక్టార్లో గల (Punjab sector) అబోహర్ సెక్టార్‌లోని బిఎస్‌ఎఫ్ పోస్ట్ జిజి బేస్ సమీపంలో భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు (ఐబి) వెంబడి జవాన్ జీరో లైన్ చెకింగ్ చేస్తున్నాడు.
దట్టమైన పొగమంచు కారణంగా, ఉదయం 6.30 గంటల ప్రాంతంలో దగ్గమైన పొగ మంచు కారణంగా జవాన్ అనుకోకుండా అవతలి వైపుకు చేరుకున్నాడని ప్రతినిధి తెలిపారు.మధ్యాహ్నం 1.50 గంటలకు పాకిస్తాన్ రేంజర్స్‌తో జరిగిన ఫ్లాగ్ మీటింగ్‌లో అతన్ని సురక్షితంగా బిఎస్‌ఎఫ్‌కి అప్పగించారని ఆయన చెప్పారు.
అంతకుముందు తమ దేశంలోకి వచ్చిన జవాన్‌ను పాక్ రేంజర్లు అరెస్ట్ చేశారు. గల్లంతైన జవాన్ బీఎస్ఎఫ్ 66 బెటాలియన్‌కు చెందినవాడు. అంతర్జాతీయ సరిహద్దు వద్ద కాపలాగా ఉన్న సదరు జవాన్.. పాక్ భూభాగంలోకి వెళ్లినట్లు సమాచారం అందిన వెంటనే ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు.
పాకిస్థాన్ రేంజ్ సీనియర్ అధికారులను సంప్రదించారు. బీఎస్‌ఎఫ్ జవాన్ తమ అదుపులోనే ఉన్నట్లు పాక్ అధికారులు ధృవీకరించారు. దాంతో పాక్ రేంజర్లతో బీఎస్ఎఫ్ అధికారులు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి జవాన్‌ను విడుదల చేయాలని కోరారు. తొలుత విముఖత వ్యక్తం చేసిన పాక్ రేంజర్లు ఆ తర్వాత విడుదల చేసేందుకు అంగీకరించారు.