New Delhi, DEC 01: డిసెంబర్ నెల (December) వచ్చేసింది. వచ్చీ రాగానే కొత్త రూల్స్ (new Rules) తెచ్చేసింది. సాధారణంగా ప్రతీ నెలలో ఏవో కొత్త మార్పులు జరుగుతూనే ఉంటాయి. అయితే డిసెంబర్ నెలలో కూడా పలు రంగాల్లో కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. డిసెంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. పలు కీలక అంశాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. బ్యాంకు లావాదేవీలు మొదలు ఆర్థికపరమైన అంశాల్లో మార్పులు జరిగాయి. వంట గ్యాస్ సిలిండర్ నుంచి పెన్షన్ సర్టిఫికెట్ (Pension Certificate) వరకు పలు అంశాల్లో మార్పులు వచ్చాయి. మరి డిసెంబర్ 1 నుంచి.. కొత్తగా వచ్చిన రూల్స్ ఏంటి? ఏయే అంశాల్లో మార్పులు జరిగాయి? తప్పకుండా తెలుసుకోవాల్సిందే. లేదంటే ఇబ్బందులు పడాల్సి రావొచ్చు.
పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏటీఎం కార్డు : పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్ అమల్లోకి తెచ్చింది. ఏటీఎంలో క్యాష్ విత్ డ్రా (Cash Withdraw) నిబంధనలను మార్చింది. కొత్త రూల్ ప్రకారం.. కస్టమర్లు డెబిట్ కార్డు ద్వారా ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేయాలంటే రిజిస్ట్రర్డ్ మొబైల్ నెంబర్ కి వచ్చే ఓటీపీ (OTP) ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల ఏటీఎం లావాదేవీలు మరింత సురక్షితంగా మారనున్నాయని బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. కాబట్టి.. కొత్త రూల్ నేపథ్యంలో పీఎన్ బీ కస్టమర్లు.. ఏటీఎంకి వెళ్లేటప్పుడు డెబిట్ కార్డుతో పాటు మొబైల్ ఫోన్ ను కూడా తప్పనిసరిగా వెంట తీసుకెళ్లడం మర్చిపోవద్దు.
పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్ : కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందుతున్న వ్యక్తులు ప్రతి ఏడాది లైఫ్ సర్టిఫికెట్ (Pension Certificate) సమర్పించాలి. నవంబర్ 30 2022 లోపు కచ్చితంగా పెన్షనర్లు ఈ సర్టిఫికెట్‌ను సమర్పించాలి. బ్యాంకు బ్రాంచ్ లో లేదా ఆన్‌లైన్‌లో జీవన్ ప్రమాణ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించవచ్చు. ఇప్పటివరకు పొందుతున్న పెన్షన్ ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలంటే నవంబర్ 30లోపు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించి ఉండాలి. లేదంటే డిసెంబర్ నుంచి పెన్షన్ పొందడం వీలు కాకపోవచ్చు.
రైల్వే టైమ్ టేబుల్‌లో మార్పు : శీతాకాలంలో ట్రైన్ల టైమ్ టేబుల్ లో మార్పులు (Railway Time Table) చేస్తుంది రైల్వే. ఇది కామన్. ట్రైన్ల టైమింగ్స్ లో మార్పులు జరుగుతాయి. టైమ్ టేబుల్ లో మార్పులు, కొత్త టైమింగ్స్ గురించి డిసెంబర్ 1న తెలుస్తుంది. శీతాకాలంలో రైళ్ల షెడ్యూల్ లో రైల్వేశాఖ మార్పులు చేయడం సర్వ సాధారణం.
అలాగే డిసెంబర్ 1 నుంచి టూవీలర్ ధరలు కూడా పెరగనున్నాయి. హీరో మోటొకార్ప్ (Hero Moto crop) ధరల పెంపును ప్రకటించింది. హీరో టూవీలర్ ధరలు రూ. 1500 వరకు పెంచింది. ఇక నాలుగు (ఢిల్లీ, ముంబై, బెంగళూరు, భువనేశ్వర్) నగరాల్లో పైలెట్ ప్రాజెక్ట్ గా డిజిటల్ రూపీ జారీ చేయనుంది ఆర్బీఐ. ఇక హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో ప్రయోగాత్మకంగా మార్పులు చేసింది టీటీడీ. బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8గంటలకు మార్చింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో రాత్రివేళ వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం కల్పించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది టీటీడీ.