IPL Auction 2025 Live

Pallonji Mistry Dies: నిద్రలోనే కన్నుమూసిన పల్లోంజీ గ్రూప్ చైర్మన్ పల్లోంజీ మిస్త్రీ, ముంబైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచిన బిజినెస్‌ టైకూన్‌

ముంబైలోని తన నివాసంలో సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు. నిద్రలోనే ఆయన కన్నుమూసినట్టు తెలుస్తోంది. 18.4 శాతం వాటాతో టాటా గ్రూప్‌లో అతిపెద్ద వ్యక్తిగత వాటాదారుగా ఉన్నారు.

Pallonji Mistry Dies

Mumbai, June 28: పల్లోంజీ గ్రూప్ చైర్మన్ పల్లోంజీ మిస్త్రీ (93) కన్నుమూశారు. ముంబైలోని తన నివాసంలో సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు. నిద్రలోనే ఆయన కన్నుమూసినట్టు తెలుస్తోంది. 18.4 శాతం వాటాతో టాటా గ్రూప్‌లో అతిపెద్ద వ్యక్తిగత వాటాదారుగా ఉన్నారు. 1929లో జన్మించిన మిస్త్రీ లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో ఉన్నత విద్యనభ్యసించారు. అంతకుముందు ముంబైలోని కేథడ్రల్ & జాన్ కానన్ స్కూల్‌లో చదువుకున్నారు.

కేవలం​18 సంవత్సరాల వయస్సులో కరియర్‌ను స్టార్ట్‌ చేసిన ఆయన క్రమంగా బడా పారిశ్రామికవేత్తగా రాణించారు. 28.90 బిలియన్ డాలర్లతో పల్లోంజీ మిస్త్రీ బిలియనీర్‌గా ఉన్నారు. ఫోర్బ్స్‌ ప్రకారం భారతదేశంలో 5వ అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్నారు. 2016లో అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి పద్మభూషణ్ అందుకున్నారు.

ఒకప్పుడు రారాజుగా వెలిగిన ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ కథ ముగిసింది, 27 ఏళ్ల అనుబంధాన్ని నెమరవేసుకుని ఎమోషనల్ అవుతున్న నెటిజన్లు

పల్లోంజీ మిస్త్రీకి ఇద్దరు కుమారులు షాపూర్ మిస్త్రీ, సైరస్ మిస్త్రీ, ఇద్దరు కుమార్తెలు లైలా మిస్త్రీ, ఆలూ మిస్త్రీ ఉన్నారు. సైరస్ మిస్త్రీ 2012 నుండి 2016 వరకు టాటా గ్రూప్ ఛైర్మన్‌గా పనిచేశారు. అయితే 2016 అక్టోబర్‌లో మిస్త్రీ చిన్న కుమారుడు సైరస్‌ను టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తొలగించడంతో టాటా, మిస్త్రీల మధ్య వివాదం రగిలిన సంగతి తెలిసిందే.