PAN-Aadhaar Linking: ఆధార్- పాన్ నెంబర్ లింక్ చేయకపోతే రూ.10,000 జరిమానా, డెడ్‌లైన్ విధించిన ఆదాయపు పన్నుశాఖ, ఈ ప్రక్రియ సులువుగా ఆన్‌లైన్‌లో ఎలా చేయవచ్చో తెలుసుకోండి

పాన్ మరియు ఆధార్‌లను అనుసంధానించే గడువు ఇప్పటికే చాలాసార్లు పొడిగించబడిందని, చివరి గడువు 31 మార్చి 2020 తో ముగుస్తుందని ఐటీ శాఖ గుర్తు చేసింది......

PAN-Aadhaar linking. | (Photo-File Image)

Mumbai, March 3: ఆధార్ కార్డు - పాన్ కార్డుతో లింక్  (PAN-Aadhaar Linking) చేశారా?  లేకపోతే వెంటనే చేసుకోండి. మార్చి 31, 2020 నాటికి ఎవరైతే తమ పాన్ నెంబర్- ఆధార్‌ నెంబర్‌తో అనుసంధానించుకోకుండా ఉంటారో వారి పాన్ కార్డ్ ఇక ముందు పనిచేయదని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది.

అంతేకాదు, పనిచేయని పాన్ కార్డును ఉపయోగించే వారికి రూ. 10,000 వరకు జరిమానా విధించబడుతుందని ఐటీ శాఖ జారీ చేసిన తాజా నోటిఫికేషన్‌లో హెచ్చరించింది.  పీఎఫ్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంతుందో ఇలా చెక్ చేయండి

ఫిబ్రవరి 15, 2020 నాటికి దేశంలో ఇంకా 17.58 కోట్ల మేర పాన్ కార్డ్ హోల్డర్లు తమ పాన్ నెంబర్‌ను ఆధార్‌తో అనుసంధానించ లేదని ఐటీ శాఖ వెల్లడించింది. గడువులోపు ఆధార్ కార్డు - పాన్ కార్డుతో లింక్ చేయని వ్యక్తులకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272 బి కింద రూ .10,000 విధించబడుతుందని పేర్కొంది.

పాన్ కార్డును ఆధార్‌తో ఆన్ లైన్ లో లింక్ చేయడం ఎలా?

 

పాన్ మరియు ఆధార్‌లను అనుసంధానించే గడువు ఇప్పటికే చాలాసార్లు పొడిగించబడిందని, చివరి గడువు 31 మార్చి 2020 తో ముగుస్తుందని ఐటీ శాఖ గుర్తు చేసింది.