Panneerselvam on BJP: తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక మలుపు, బీజేపీ నేతలు నాతో టచ్‌లో ఉన్నారంటూ మాజీ సీఎం ప్రకటన, పొత్తు ఉండదంటూ అన్నాడీఎంకే ప్రకటించడంపై ఓపీఎస్‌ ఫైర్‌

బీజేపీతో తెగ‌దెంపులు చేసుకుంటూ ఎన్డీయే కూట‌మి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చినట్టు ఏఐఏడీఎంకే ప్ర‌క‌టించ‌గా ప‌ళ‌నిస్వామి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే బ‌హిష్కృత నేత, త‌మిళ‌నాడు మాజీ సీఎం ఓ ప‌న్నీర్‌సెల్వం (Panneerselvam) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

O Panneerselvam (Photo Credits: ANI)

Chennai, SEP 29: బీజేపీతో తెగ‌దెంపులు చేసుకుంటూ ఎన్డీయే కూట‌మి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చినట్టు ఏఐఏడీఎంకే ప్ర‌క‌టించ‌గా ప‌ళ‌నిస్వామి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే బ‌హిష్కృత నేత, త‌మిళ‌నాడు మాజీ సీఎం ఓ ప‌న్నీర్‌సెల్వం (Panneerselvam) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం త‌న‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ద‌ని, కూట‌మిపై బీజేపీ (BJP) ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత‌నే త‌న వైఖ‌రి వెల్ల‌డిస్తాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామ‌లైని మార్చాల‌ని ఏఐఏడీంఎకే (AIADMK) కాషాయ పార్టీపై ఒత్తిడి తీసుకువ‌చ్చింద‌నే ప్ర‌చారంపై ఓపీఎస్ స్పందిస్తూ ప‌ళ‌నిస్వామిని మార్చాల‌ని బీజేపీ కోరితే ఏఐఏడీఎంకే అంగీక‌రిస్తుందా అని ప్ర‌శ్నించారు. బీజేపీ ఒత్తిడికి త‌లొగ్గి ప‌ళ‌నిస్వామిని మార్చేస్తుందా అని అన్నారు. బీజేపీ రాష్ట్ర నాయ‌క‌త్వాన్ని మార్చాల‌ని ఎలా అడుగుతార‌ని అన్నారు. అలా అడిగే హ‌క్కు ప‌ళ‌నిస్వామి పార్టీకి లేద‌ని చెప్పారు.

One Nation One Election: జమిలి ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదు! కేంద్రానికి షాక్‌ ఇచ్చిన లా కమిషన్, రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందన్న నిపుణులు 

కాగా బీజేపీతో సంబంధాల‌ను తెంచుకుంటామ‌ని, 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల‌తో పాటు రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కొత్త కూట‌మితో ముందుకెళ‌తామ‌ని ఏఐఏడీఎంకే ప్ర‌తినిధి మునుస్వామి స్ప‌ష్టం చేశారు. బీజేపీతో పొత్తు ఉండ‌ద‌ని, తాము తిరిగి ఎన్డీయే గూటికి చేరేది లేద‌ని ఆయ‌న తేల్చిచెప్పారు. బీజేపీ రాష్ట్ర శాఖ చీఫ్ అన్నామ‌లైని తొల‌గించాల‌ని తాము బీజేపీ నాయ‌క‌త్వాన్ని కోర‌లేద‌ని పేర్కొన్నారు.



సంబంధిత వార్తలు

CPI Narayana On Pushpa 2: అదో సినిమానా? స్మగ్లింగ్‌ ను గౌరవంగా చూపించే అలాంటి సినిమాకు మీరు రాయితీ ఇవ్వడమా? పుష్ప-2, తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ మండిపాటు

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్

Akbaruddin Owaisi on Allu Arjun: అల్లు అర్జున్ పై అసెంబ్లీ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ అక్బ‌రుద్దీన్ ఓవైసీ, ఓ మ‌హిళ చ‌నిపోతే అలా చేశారంటూ ఆగ్ర‌హం

Allu Arjun on Sandhya Theater Row: అందుకే శ్రీ‌తేజ్ ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల‌లేదు, నేను ఆ రోజు అస్స‌లు రోడ్ షో చేయ‌లేదు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై స్పందించిన అల్లు అర్జున్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif