Lok Sabha Security Breach: లోక్‌సభలో భద్రతా వైఫల్యంపై చర్చించడానికి ఎంపీల సమావేశానికి పిలుపునిచ్చిన స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా, దర్యాప్తు బాధ్యత నాదేనని తెలిపిన స్పీకర్
వారి దగ్గరున్న వస్తువులను స్వాధీనం చేసుకున్నాం. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతాం. ఆ పూర్తి బాధ్యత నాదే. నిందితులు వదిలింది కేవలం సాధారణ పొగే అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
New Delhi, Dec 13: పార్లమెంట్ (Parliament)పై ఉగ్రదాడి జరిగి 22 ఏళ్లు పూర్తయిన రోజే.. లోక్‌సభ (Lok sabha)లో భద్రతా వైఫల్యం చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. బుధవారం లోక్‌సభలో ఇద్దరు దుండగులు గందరగోళం సృష్టించారు. ఓ వ్యక్తి పబ్లిక్ గ్యాలరీ (public gallery) నుంచి లోక్‌సభలోకి దూకగా.. మరో వ్యక్తి గ్యాలరీ నుంచి ఒక రకమైన పొగను వదిలి భయభ్రాంతులకు గురిచేశాడు.
లోక్‌సభలోకి దూకిన వ్యక్తి.. ఎంపీలు కూర్చునే టేబుళ్లపైకి ఎక్కి ‘నల్ల చట్టాలను బంద్ చేయాలి’ అని నినాదాలు చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో అప్రమత్తమైన ఎంపీలు వారిని చుట్టుముట్టి పట్టుకున్నారు. అనంతరం భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటనతో వెంటనే స్పీకర్ సభను వాయిదా వేశారు. జీరో అవర్‌లో భాజపా ఎంపీ ఖగేన్ ముర్ము మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనపై స్పీకర్ ఓం బిర్లా (Lok Sabha Speaker Om Birla) స్పందించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడుతామని, దానికి పూర్తి బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తారు. భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చర్చించాలని పట్టుబట్టారు.
Heres' Video
దీనికి స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. లోక్‌సభ లోపల ఇద్దరు దుండగులు, బయట మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నాం. వారి దగ్గరున్న వస్తువులను స్వాధీనం చేసుకున్నాం. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతాం. ఆ పూర్తి బాధ్యత నాదే. నిందితులు వదిలింది కేవలం సాధారణ పొగే అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
వీడియో ఇదిగో, పార్లమెంటు భవనం వెలుపల టియర్ గ్యాస్ ప్రయోగించిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే, నిందితులు వదిలిన గ్యాస్ ఏమిటనే దానిపై సమగ్ర విచారణ జరుపుతాం. దీనిపై ఈ సాయంత్రం సమావేశం (Calls Meeting of MPs To Discuss Security) నిర్వహిస్తాం. సభ్యుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటాం’’ అని వెల్లడించారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే.. సభ సజావుగా నిర్వహించడం మనందరి బాధ్యత అని స్పీకర్ అన్నారు.