Parliament Winter Session 2024: బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతూ రాజీనామా చేయాల్సిందేనని ఇండియా కూటమి డిమాండ్, కాంగ్రెస్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని మండిపడిన బీజేపీ, వేడెక్కిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్లమెంటులో పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది.
New Delhi, Dec 19: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్లమెంటులో పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది. ఈ వ్యాఖ్యలపై హోం మంత్రి వెంటనే క్షమాపణలు చెప్పాలని, రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వద్ద నిరసన చేపట్టారు.
మరోవైపు, బీఆర్ అంబేద్కర్‌ను కాంగ్రెస్ పార్టీ అవమానించిందని ఆరోపిస్తూ బీజేపీ కూడా నిరసన కవాతు ప్రారంభించింది.రెండు పార్టీల నిరసనల మధ్య ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. అమిత్ షా రాజ్యాంగ రూపశిల్పిని అవమానించారని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ఆరోపించగా, ప్రతిపక్ష పార్టీ క్లిప్ చేసిన వీడియోలను సర్క్యులేట్ చేస్తోందని, చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందని బిజెపి ఆరోపించింది.తన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించిందని అమిత్ షా ఆరోపించారు.
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష ఎంపీల ఆందోళనలతో గందరగోళం నెలకొంది. అంబేద్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. నేడు పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేపట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ.. బీజేపీ ఎంపీలు కూడా ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్‌లోని మకర ద్వారం తోపులాట జరిగింది. ఆ ఘర్షణలో బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముకేశ్ రాజ్‌పుత్ గాయపడ్డారు.
Parliament Chaos Videos
Rahul Gandhi Statement
ఈ ఘటనపై సారంగి మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ మరో ఎంపీని తోసేయడంతో ఆయన వచ్చి తనపై పడ్డారని, ఇద్దరమూ కిందపడడంతో తన తలకు గాయమైందని ఆరోపించారు. రాహుల్ గాంధీ తోసేయడం వల్లనే తాను కిందపడ్డానని సారంగి చెప్పారు. రాహుల్ గాంధీ తోయడం వల్లే ఎంపీలకు గాయమైనట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ ఎంపీలను ఆస్పత్రిలో చేర్పించారు.వీరిని పలువురు కేంద్రమంత్రులు, తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ప్రధాని మోదీ ఫోన్లో పరామర్శించారు. వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
Amit Shah should apologize to the country for this: Congress Party
ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాట్లాడుతూ. ‘‘జరిగిందంతా మీ కెమెరాల్లో కనబడి ఉండొచ్చు. నేను పార్లమెంట్ లోపలికి వెళ్తుండగా బీజేపీ ఎంపీలు నన్ను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. తోసేశారు. బెదిరించారు. మల్లికార్జున్ ఖర్గేను కూడా నెట్టేశారు. మాకు లోపలికి వెళ్లే హక్కు ఉంది. కానీ, వారు అడ్డుకుంటున్నారు. ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే.. రాజ్యాంగంపై వారు (బీజేపీ) దాడి చేస్తున్నారు. అంబేడ్కర్‌ను అవమానించారు’’ అని రాహుల్ దుయ్యబట్టారు. బీజేపీ ఎంపీలే తమను అడ్డుకున్నారని ఆరోపిస్తూ అందుకు సంబంధించిన వీడియోను కాంగెస్ ‘ఎక్స్’లో షేర్ చేసింది.
నా వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించింది: షా
అంబేడ్కర్‌పై తాను చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరిస్తోందని అమిత్‌షా విరుచుకుపడ్డారు. బాబాసాహెబ్‌కు వ్యతిరేకంగా తాను ఎన్నటికీ మాట్లాడనని తేల్చిచెప్పారు. బుధవారం ఆయన ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘కాంగ్రెస్ అంబేడ్కర్ వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక పార్టీ. రిజర్వేషన్ల వ్యతిరేక పార్టీ. రాజ్యాంగ విలువలను మసకబార్చిన చరిత్ర కాంగ్రె్‌సది’ అని దుయ్యబట్టారు. తన రాజీనామాకు ఖర్గే డిమాండ్ చేయడాన్ని ప్రస్తావించగా.. ‘అది ఆయన్ను సంతృప్తిపరిచేటట్లయితే పదవి నుంచి వైదొలుగుతా. కానీ దానివల్ల ఆయన సమస్యలు తీరవు. మరో 15 ఏళ్లు ఆయన ప్రతిపక్షంలోనే ఉండాల్సి ఉంటుంది’ అని షా తెలిపారు.
కాంగ్రెస్ కొత్త నాటకాలు: ప్రధాని మోదీ ఆగ్రహం
ప్రతి దానికీ అంబేడ్కర్ పేరు ప్రస్తావించడం కాంగ్రెస్ పార్టీకు ఫ్యాషన్‌గా మారిందని.. ఆయన పేరు కాకుండా దేవుడిని స్మరించుకుంటే ఏడు జన్మలు స్వర్గం లభిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ గట్టిగా సమర్థించారు. అంబేడ్కర్ చరిత్రను తుడిచిపెట్టేందుకు ఆ పార్టీ పన్నని కుట్ర లేదని విమర్శించారు. బాబాసాహెబ్‌ను అవమానించిన ఆ పార్టీ చరిత్రను, వాస్తవాల చిట్టాను షా రాజ్యసభలో బయటపెట్టారని.. అది చూసి కాంగ్రెస్ నేతలు బిత్తరపోయారని అన్నారు. అందుకే అంబేడ్కర్‌ను ఆయన అవమానించారని, కేబినెట్ నుంచి బహిష్కరించాలంటూ కొత్త నాటకాలు మొదలుపెట్టారని మండిపడ్డారు. ‘వారి దురదృష్టం ఏమిటంటే.. ప్రజలకు నిజం తెలుసు’ అని ప్రధాని బుధవారం ‘ఎక్స్’లో వరుస ట్వీట్లు చేశారు.
కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ :
బీఆర్ అంబేద్కర్ కు భారత రత్న ఇవ్వలేదని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ గాంధీ కుటుంబన్ని విమర్శించారు. అయితే గాంధీ కుటుంబంలోని వారంతా భారతరత్నలు అందుకున్నారని గుర్తు చేశారు. బీఆర్ అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ అవమాన పరిచిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 24 గంటలు నిరాహార దీక్ష చేపట్టి.. ఆ పార్టీ చేసిన తప్పలకు ప్రాయశ్చితంగా మౌనం పాటించాలని గాంధీ కుటుంబానికి కేంద్ర మంత్రి సూచించారు. మరోవైపు అమిత్ షా క్షమాపణతోపాటు రాజీనామా కోరుతూ.. పార్లమెంట్ ప్రధాన ద్వారం మకర్ ద్వార్ గోడలు ఎక్కారు. ఇఖ రాహుల్ గాంధీ.. ఓ ఎంపీని తమపైకి నెట్టడం వల్ల ఓ ఎంపీ గాయపడ్డారని బీజేపీ పేర్కొంది.
పార్లమెంట్‌లో బీఆర్ అంబేద్కర్‌ను అవమానించారని ఆరోపిస్తూ అమిత్ షా ప్రసంగానికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ షేర్ చేయడంతో పెద్ద రాజకీయ వివాదం చెలరేగింది. ఇక రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా అంబేద్కర్ ను అవమాన పరిచిందని బీజేపీ ఆరోపించింది. అలాగ అమిత్ షా ప్రసంగానికి సంబంధిన వీడియోను సైతం ఆ పార్టీ తారుమారు చేసిందని విమర్శించింది. ఈ నేపథ్యంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బీజేపీ హెచ్చరించింది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)