Shaheen Bagh Protests: షాహిన్ బాగ్ నిరసనలపై సుప్రీంకోర్టులో విచారణ, రోడ్లపై నిరవధిక నిరసనలు తెలపడం పట్ల కోర్ట్ అభ్యంతరం, ప్రభుత్వానికి నోటీసులు జారీ

పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో హింసకు మైనారిటీలకు (హిందూ, సిక్కు తదితర ముస్లింమేతరులకు) భారత పౌరసత్వం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ చట్టం ప్రవేశపెట్టింది. అప్పట్నించీ ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టే నిరసనలకు దిల్లీలోని షాహీన్ బాగ్ కేంద్రంగా మారింది....

Shaheen Bagh Protests (Photo Credits: IANS)

New Delhi, February 10:  పౌరసత్వ సవరణ చట్టం (Citizenship Amendment Act) ను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని దిల్లీలోని షాహీన్ బాగ్ ప్రాంతంలో జరుగుతున్న నిరసనల పట్ల సుప్రీంకోర్ట్ (Supreme Court) సోమవారం విచారించింది.  నిరసనకారులకు వ్యతిరేకంగా ఎలాంటి ఉత్తర్వులను జారీచేయనప్పటికీ, ప్రజారహదారులను అడ్డగిస్తూ నిరవధిక నిరసనలు చేయడాన్ని సుప్రీం ప్రశ్నించింది.  "ప్రజలు నిరసన తెలపొచ్చు, అయితే అందుకంటూ ఒక చోటు ఉంటుంది, అంతేకానీ నిరవధికంగా ప్రజారహదారులను నిరసనలతో అడ్డుకోవడం తగదు" అని కోర్ట్ పేర్కొంది.

షాహీన్ బాగ్ (Shaheen Bagh) లో నిరసనకారులు రహదారులను దిగ్భంధిస్తున్నారు. రెండు నెలలు కావొస్తున్నా అక్కడ నిరసనలు విరమించడం లేదు, దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు, వారిని వెంటనే ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.

ఈ పిటిషన్లపై కె.ఎం.జోసెఫ్‌ సహా ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్ట్ ధర్మాసనం సోమవారం విచారించింది. నిత్యం రద్దీగా ఉండే చోట కాకుండా నిరసనకారులు మరోచోటును ఎంచుకోవాల్సిందిగా సూచించింది. నిరసనలు వ్యక్తం చేసే ప్రాంతాన్ని నిర్వచించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం మరియు దిల్లీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్ట్ నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను ఫిబ్రవరి 17కు వాయిదా వేసింది.

ANI Update:

కాగా, సుప్రీం సూచనల పట్ల స్పందించిన షాహీన్ బాగ్ నిరసన కారులు సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉండేందుకు సిద్ధంగా ఉన్నట్లు మీడియాకు వివరించారు.  "కోర్టు నిర్దేశిస్తే, మేము జంతర్ మంతర్ లేదా రామ్ లీలా మైదాన్ ప్రాంతాలను ఎంపిక చేసుకుంటాం, అయితే ఏదిఏమైనా మా నిరసనలు మాత్రం కొనసాగుతాయి" అని పేర్కొన్నారు.

పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో హింసకు మైనారిటీలకు (హిందూ, సిక్కు తదితర ముస్లింమేతరులకు) భారత పౌరసత్వం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ చట్టం ప్రవేశపెట్టింది. అప్పట్నించీ ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టే నిరసనలకు దిల్లీలోని షాహీన్ బాగ్ కేంద్రంగా మారింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Who Is Rekha Gupta? ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తా ఎవరు? ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే సీఎం పదవి ఎలా వరించింది, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే పూర్తి బయోగ్రఫీ ఇదే..

BRS MLAs Defection Case: సుప్రీంకోర్టులో నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు విచారణ.. తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ

Central University Students Protest: వీడియో ఇదిగో, సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం, విద్యార్థినుల బాత్రూం లోకి తొంగి చూసిన గుర్తు తెలియని వ్యక్తులు, అర్థరాత్రి ధర్నాకు దిగిన విద్యార్థినులు

Madhya Pradesh High Court: భర్త కాకుండా మరో పరాయి వ్యక్తిపై భార్య ప్రేమ, అనురాగం పెంచుకోవడం నేరం కాదు.. శారీరక సంబంధంలేనంత వరకూ వివాహేతర సంబంధంగా పరిగణించకూడదు.. మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Share Now