Dog Attack in Noida: లిఫ్ట్ ఎక్కిన చిన్నారులకు చుక్కలు చూపించిన కుక్క, భయంతో వణికిపోయిన ఇద్దరు చిన్నారులు, అపార్ట్ మెంట్లలో పెంపుడు కుక్కల నిర్వహణపై మరోసారి చర్చ
ఇప్పటికే నోయిడా ప్రాంతంలో కుక్కకాటు కేసులు పెరిగిపోయాయి. తాజాగా గోల్డెన్ పామ్ సొసైటీలో (Golden Palm Society ) ఇద్దరు చిన్నారులపై పెంపుడు కుక్క దాడి చేసింది (Dog Attack in Noida). లిఫ్ట్‌లో వెళ్తుండగా ఇద్దరు చిన్నారులను పెంపుడుకుక్క భయబ్రాంతులకు గురిచేసింది
Noida, NOV 26: నోయిడాలో (Noida) కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇప్పటికే నోయిడా ప్రాంతంలో కుక్కకాటు కేసులు పెరిగిపోయాయి. తాజాగా గోల్డెన్ పామ్ సొసైటీలో (Golden Palm Society ) ఇద్దరు చిన్నారులపై పెంపుడు కుక్క దాడి చేసింది (Dog Attack in Noida). లిఫ్ట్‌లో వెళ్తుండగా ఇద్దరు చిన్నారులను పెంపుడుకుక్క భయబ్రాంతులకు గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral video) మారింది. పెంపుడు జంతువులకు సంబంధించి గోల్డెన్ పామ్ సొసైటీలో కఠిన నిబంధనలు ఉన్నాయి. అయినప్పటికీ వాటిని పాటించకపోవడం వల్లనే ఈ ఘటన జరిగిందని నిర్వాహకులు అంటున్నారు.
వీడియో ప్రకారం కింద నుంచి అపార్ట్ మెంట్ పై అంతస్తుకు ఇద్దరు చిన్నారులు వెళ్తుండగా మధ్యలో ఓ మహిళ తన పెంపుడు కుక్కతో లిఫ్ట్‌లో ఎక్కింది. కుక్కను చూసి అప్పటికే భయానికి గురైన చిన్నారి..ఓ మూలకు నక్కింది. అయినప్పటికీ ఆగకుండా కుక్క వారిపై దాడి చేసింది. దాంతో పెంపుడు కుక్క యజమాని వెంటనే ఆ చిన్నారులను లిఫ్ట్ దిగివెళ్లమని సూచించింది. ఈ మొత్తం వ్యవహారంపై గోల్డెన్ పామ్ సొసైటీలో నిర్వాహకులు విచారణ చేపట్టారు.