Petrol-Diesel Price Cut: చమురు కంపెనీలు లాభాల్లోకి వస్తున్నాయి..పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం.. కేంద్ర పెట్రోలియం హర్‌దీప్ సింగ్ పూరీ ప్రకటన
ఇంధన ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. 2024లో లోక్‌సభ ఎన్నికలు రానున్న విషయం తెలిసిందే.చమురు కంపెనీలు లాభాల్లోకి వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో తగ్గే సూచనలు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం హర్‌దీప్ సింగ్ పూరీ ఓ సదస్సులో అన్నారు.
వాహన దారులకు గుడ్ న్యూస్. ఇంధన ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. 2024లో లోక్‌సభ ఎన్నికలు రానున్న విషయం తెలిసిందే.చమురు కంపెనీలు లాభాల్లోకి వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో తగ్గే సూచనలు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం హర్‌దీప్ సింగ్ పూరీ ఓ సదస్సులో అన్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో పెట్రోల్ (Petrol), డీజిల్ (Deasel) ధరలను తగ్గించాలని కేంద్రం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. చమురు కంపెనీలు కారణంగా చమురు ధరలను విపరీతంగా పెంచాయి. రికవరీ పేరుతో పెట్రోల్ ,డీజిల్ పై అధిక చార్జీలను పెంచాయి . అయితే ఈ త్రైమాసికంలో చమురు కంపనీలు లాభాల బాట పట్టడంతో రికవరీ చార్జీలను ఎత్తేసే అవకాశము ఉంది. దీనితో చమురు ధరలు తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి .
ఈ సందర్భంగా కేంద్ర పెట్రోలియం వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ "భారత విజయం సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (SDGs) విజయంలో ఉంది SDGలు విజయవంతం కావాలంటే, భారతదేశం విజయం సాధించాలి" అని ఉద్ఘాటించారు. UN గ్లోబల్ కాంపాక్ట్ నెట్‌వర్క్ ఇండియా (UN GCNI) యొక్క 18వ జాతీయ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ, భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం, ఐదవ అతిపెద్ద మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడులకు అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. "భారతదేశంలో ఫలితాలు ప్రపంచ ఫలితాలను నిర్ణయిస్తాయి" అని ఆయన అన్నారు.