IPL Auction 2025 Live

Petrol Diesel Prices Today: హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 112 రూపాయలు దాటేసింది, దేశ వ్యాప్తంగా మరోసారి పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు, వాహన దారులకు చుక్కలే...

వరుసగా రెండు రోజుల పెరుగుదల తర్వాత ఒకరోజు స్థిరంగా ఉన్న ధరలు, మళ్లీ మూడు రోజులు వరుసగా 80 పైసల చొప్పున పెరిగాయి. ఈ ఆరు రోజుల్లో ఐదుసార్లు కూడా 80 పైసల చొప్పున పెరిగాయి.

Road Development Cess In AP | Representational Image | (Photo Credits: PTI)

పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం (మార్చి 27, 2022) పెరిగాయి. వరుసగా రెండు రోజుల పెరుగుదల తర్వాత ఒకరోజు స్థిరంగా ఉన్న ధరలు, మళ్లీ మూడు రోజులు వరుసగా 80 పైసల చొప్పున పెరిగాయి. ఈ ఆరు రోజుల్లో ఐదుసార్లు కూడా 80 పైసల చొప్పున పెరిగాయి. నవంబర్ 4, 2021 తర్వాత మార్చి 22వ తేదీ నుండి ధరలు పెరుగుతున్నాయి. మధ్యలో ఒకరోజు స్థిరంగా ఉంది. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు ఇటీవల భారీగా పెరిగి, ఆ తర్వాత కాస్త శాంతించాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లుగా కనిపించడంతో ధరలు కాస్త క్షీణించాయి.

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL) చమురు ధరలకు సంబంధించి నేడు (మార్చి 27, 2022) కొత్త ధరలను విడుదల చేశాయి. ఆదివారం పెట్రోల్‌పై 50 పైస‌లు, డీజిల్‌పై 55పైస‌లు పెరిగాయి. సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. నాలుగు రోజుల నుండి పెరుగుదల కనిపించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల పైకి, కిందకు కదులుతున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా పెట్రోల్, డీజిల్ పైన ఉంటుంది.

పెట్రోల్‌, డీజిల్ ధరలివే..!

- దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 99.11 కాగా, డీజిల్‌ రూ. 90.42 వద్ద కొనసాగుతోంది.

- దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 113.88 కాగా, డీజిల్‌ రూ. 98.13గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..!

- హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 112.35 వద్ద కొనసాగుతుండగా, డీజిల్‌ రూ. 98.68గా ఉంది.

- విజ‌య‌వాడ‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 114.06కాగా, డీజిల్‌ రూ. 100.08కి చేరింది.