PM-KISAN Scheme: పీఎం కిసాన్ పథకం అలర్ట్, ఈ రైతులంతా పీఎం కిసాన్ పథకానికి అనర్హులంటూ కేంద్రం కీలక ప్రకటన, వారి నుండి డబ్బు వెనక్కి తీసుకోవాలని రాష్ట్రాలకు ఆదేశాలు

అయితే తాజాగా కేంద్రం దీనిపై రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

PM Narendra Modi (Photo Credits: ANI)

Mumbai, April 15; కేంద్రప్రభుత్వం దేశంలోని రైతుల కోసం ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం (PM-KISAN Scheme) ప్రవేశపెట్టిన సంగతి విదితమే. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం దాదాపు 6 వేల రూపాయలను కేంద్రం రైతుల ఖాతాల్లో వేస్తూ వస్తోంది. విడతల వారిగా నేరుగా అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తూ వస్తోంది. ఒక్కో విడతల రూ. 2 వేల రూపాయాలను జమచేయగా.. ఇప్పటివరకు పది విడతల నగదును రైతుల ఖాతాల్లో జమ చేశారు.

దేశంలో సొంతంగా భూమి కలిగినవారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇప్పటివరకు ఈ స్కీమ్ కింద అనర్హులైన వారికి దాదాపు 4,350 కోట్ల రూపాయలకు పైగా బదిలీ (Over Rs 4,350 cr transferred to ineligible beneficiaries) చేయబడిందని కేంద్రం గుర్తించింది. అయితే తాజాగా కేంద్రం దీనిపై రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పీఎం కిసాన్ పథకం కింద ఆదాయపు పన్ను చెల్లించి ప్రయోజనాలు పొందే అర్హత లేని వారి నుంచి రీయంబర్స్‏మెంట్ అంటే వారు పొందిన నగదును వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వం రాష్ట్రాలకు ( advisory issued to states for refunds) సూచించింది.

భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన, అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌

తాజాగా ఈ పథకానికి అర్హులైన కుటుంబాలను గుర్తించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిగి ఉంటాయి. ఈ క్రమంలోనే పీఎం కిసాన్ పథకానికి అర్హులు కానీ వారి జాబితాను విడుదల చేసింది. ఈ పథకం (Pradhan Mantri Kisan Samman Nidhi Yojana) కుటుంబంలోని భర్త, భార్య, వారి మైనర్ పిల్లలకు వర్తిస్తుంది. అయితే ఈ పథకానికి ఉన్నత ఆర్థిక స్థితికి చెందినవారు అనర్హులు అని కేంద్రం తెలిపింది. అలాగే మరికొందరు కూడా ఈ పథకానికి అనర్హులు.

అనర్హులైన వారి జాబితా

సంస్థాగత భూమి కలవారు ఈ పథకానికి అనర్హులు.

మాజీ, ప్రస్తుతం రాజ్యంగ పదవులు కలిగి ఉన్న రైతు కుటుంబాలు.

మాజీ, ప్రస్తుత మంత్రులు, పార్లమెంట్, శాసనసభ్యులుగా ఉన్న కుటుంబాలు.

రాష్ట్ర శాసన మండలి సభ్యుల కుటుంబాలు, మునిసిపల్ కార్పొరేషన్ మాజీ, ప్రస్తుత మేయర్ , జిల్లా పంచాయితీల మాజీ,ప్రస్తుత అధ్యక్షుల కుటుంబాలు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో ప్రస్తుతం పనిచేస్తున్నవారు… పదవి విరమణ పొందిన అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు.

కేంద్ర లేదా రాష్ట్ర PSEలు, అనుబంధిత కార్యాలయాలు లేదా కేంద్రం పరిధిలోని స్వయంప్రతిపత్త సంస్థలలో ప్రస్తుత లేదా మాజీ అధికారులు. (స్థానిక సంస్థల రెగ్యులర్ ఉద్యోగులు, మల్టీ టాస్కింగ్ సిబ్బంది, క్లాస్ IV, గ్రూప్ డీ ఉద్యోగులు మినహా).

నెలవారీ పెన్షన్ రూ. 10,000 లేదా అంతకంటే ఎక్కువ తీసుకునేవారు అనర్హులు.

గత అసెస్‌మెంట్ సంవత్సరాల్లో ఆదాయపు పన్ను చెల్లించిన వారు.

ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్‌లు వంటి ఉద్యోగులకు కూడా పీఎం కిసాన్ డబ్బులు రావు.

రిక్టర్‌ స్కేలుపై 5.3 తీవ్రతతో భారీ భూకంపం, అరుణాచల్‌ప్రదేశ్‌లో కదిలిన భూపలకాలు, నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని తెలిపిన అధికారులు

అయితే ఇప్పటివరకు పీఎం కిసాడ్ డబ్బులు పొందిన అర్హత లేనివారు ఇక ఆ నగదును తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాల్సి ఉంటుంది.. అందుకోసం ముందుగా వీరు పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్‏కు లాగిన్ అయ్యి.. అక్కడ “రిఫండ్ ఆప్షన్ ” పై క్లిక్ చేయాలి. దీంతో వారు ఇప్పటివరకు పొందిన నగదును కేంద్రానికి తిరిగి ఇవ్వచ్చు.