INS Vikrant: భారత అమ్ములపొదిలోకి బాహుబలి యుద్ధనౌక, పూర్తిగా భారత్‌లోనే తయారైన ఐఎన్‌ఎస్ విక్రాంత్ నౌకను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ, బాహుబలి యుద్ధనౌక ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు!
కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తొలి బాహుబలి నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను (INS Vikrant) ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ఈ విమాన వాహక నౌకను జాతికి అంకితం చేశారు. కాగా ఇది 2023లో తూర్పు నౌకాదళ అమ్ములపొదిలో పూర్తిస్థాయిలో చేరే అవకాశముంది.
Cochin, SEP 02: కేరళలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పర్యటన కొనసాగుతోంది. కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తొలి బాహుబలి నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను (INS Vikrant) ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ఈ విమాన వాహక నౌకను జాతికి అంకితం చేశారు. కాగా ఇది 2023లో తూర్పు నౌకాదళ అమ్ములపొదిలో పూర్తిస్థాయిలో చేరే అవకాశముంది. ఐఎన్‌ఎస్ విక్రాంత్ నౌక (INS Vikrant) గంటలకు 28 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించనుంది.దీని తయారీకి 13 ఏళ్ల సమయం పట్టింది. 262 మీటర్ల పొడవు,. 62 మీటర్ల వెడల్పు కలిగిన ఈ నౌక బరువు 37,500 టన్నులు. ఇందులో మొత్తం 14 అంతస్తులు, 2300 కాంపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. విధుల్లో 1600 మంది సిబ్బంది ఉంటారు.
కాగా ఇప్పటిదాకా భారత్ వద్ద ఉన్న యుద్ధ నౌకలన్నీ బ్రిటన్, రష్యాల నుంచి దిగుమతి చేసుకున్నవే. అలాంటిది అగ్రదేశాలే ఆశ్చర్యపోయేలా అత్యాధునిక విమానవాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను (INS Vikrant) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ విజయవంతంగా నిర్మించింది.
ఈ సామర్థ్యమున్న అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ సరసన సగర్వంగా తలెత్తుకుని నిలిచింది. చైనాతో ఉద్రిక్తత నెలకొన్న వేళ ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతమిస్తూ నిర్మించిన ఈ బాహుబలి యుద్ధనౌకను ప్రధాని నరేంద్ర మోదీ కొచ్చి తీరంలో నావికాదళానికి అప్పగించనున్నారు.