PM Modi Meet with CMs: కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ప్రధాని కీలక నిర్ణయం, అన్ని రాష్ట్రాల సీఎంలతో మోడీ వర్చువల్ సమావేశం, కొత్త నిబంధనలను విధిస్తారని టాక్‌

అన్ని రాష్ట్రాల సీఎంలతో వర్చువల్‌ గా సమావేశం కానున్నారు మోడీ(PM Modi will interact with CMs). కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రాల్లో వైరస్ కట్టడిపై ఆయన పలు సూచనలు చేయనున్నారు. గురువారం సాయంత్రం నాలుగున్నరకు ఈ సమావేశం జరగనుంది.

PM Narendra Modi Holds COVID-19 Review Meeting with Chief Ministers of Around 10 States (Photo-ANI)

New Delhi January 13: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాల సీఎంలతో వర్చువల్‌ గా సమావేశం కానున్నారు మోడీ(PM Modi will interact with CMs). కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రాల్లో వైరస్ కట్టడిపై ఆయన పలు సూచనలు చేయనున్నారు. గురువారం సాయంత్రం నాలుగున్నరకు ఈ సమావేశం జరగనుంది. దేశంలో కోవిడ్ పరిస్థితి(Corona situation in India)పై సమావేశంలో చర్చిస్తారు. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షిస్తారు.

అయితే కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో కొత్త నిబంధనలపై సీఎంల అభిప్రాయాలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ నెల చివరి వరకు థర్డ్ వేవ్ పీక్స్(Third wave in India) కు వెళ్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్‌ డౌన్ లను అమలు చేస్తున్నాయి. కానీ కట్టడి చర్యలను మరింత కఠినతరం చేయాలని సీఎంలకు ప్రధాని సూచించే అవకాశముంది. అంతేకాదు వ్యాక్సినేషన్(Vaccination) ప్రక్రియపై కూడా ప్రధాని సమావేశంలో చర్చ జరిగే ఛాన్స్ కనిపిస్తోంది.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే కేంద్రం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. జిల్లా స్థాయిలో ఆస్పత్రుల్లో మౌళిక సదుపాయాలను పటిష్టం చేయాలని కోరింది. అన్ని రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవ్యా వర్చువల్ భేటీ నిర్వహించారు. నిపుణుల కమిటీతో కూడా ప్రధాని ఇప్పటికే ఒక దఫా సమీక్ష చేశారు.