'Signing Off': సోషల్ మీడియాకు సెలవు ప్రకటించిన ప్రధాని మోదీ, నా అకౌంట్లను 7 మంది మహిళలు రన్ చేస్తారని ట్విట్టర్ ద్వారా వెల్లడి, తొలి ట్వీట్ చేసిన స్నేహా మోహన్‌దాస్
ఈ రోజు సోషల్ మీడియాకు ప్రధాని మోదీ గుడ్ బై (PM Modi To Quit Social Media) చెప్పారు. సామాజిక మాధ్యమాల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
New Delhi, March 8: ప్రధాని నరేంద్ర మోడీ (Indian Prime Minister Narendra Modi) అనుకున్నట్లుగానే మహిళా దినోత్సవం రొజున (International Women's Day 2020) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు సోషల్ మీడియాకు ప్రధాని మోదీ గుడ్ బై (PM Modi To Quit Social Media) చెప్పారు. సామాజిక మాధ్యమాల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8నే ఎందుకు జరుపుకుంటారు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. తాను గతంలో చెప్పినట్టుగానే సామాజిక మాధ్యమాలకు వీడ్కోలు పలుకుతున్నట్లు ట్వీట్ చేశారు.
తన సోషల్ మీడియా అకౌంట్లను ఏడుగురు మహిళామణులు హ్యాండిల్ చేస్తారని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రతిభామూర్తులు ఉన్నారని.. వారంతా విభిన్న రంగాల్లో విస్తృత సేవలు అందిస్తున్నారని మోదీ ట్వీట్ చేశారు. వారి పోరాటం లక్షలాది మందికి స్ఫూర్తిదాయకమన్నారు.
Here's the tweet:
వారి విజయోత్సవ సంబరాలు చేసుకుంటూనే.. వారి నుంచి నేర్చుకుందామని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ‘నారీ శక్తి’ పురస్కారాలు అందించనున్నారు. ఈ సందర్భంగా వారితో ప్రధాని మోదీ మాట్లాడనున్నారు.
7 మంది మహిళల్లో ఒకరైన స్నేహా మోహన్‌దాస్ తాను చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను ఓ వీడియో ద్వారా వివరిస్తూ దాన్ని ట్వీట్ చేశారు. ఫుడ్ బ్యాంక్ ఇండియా పేరిట పేదల ఆకలి తీర్చుతున్నట్లు ఆమె వివరించారు.