International Women's Day 2020: అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మార్చి 8నే ఎందుకు జరుపుకుంటారు, అసలు ఇది ఎలా పుట్టింది, ఉమెన్స్‌ డే పై ప్రత్యేక కథనం
Women's Day 2020 Wishes (Photo Credits: File Photo)

New Delhi, March 8: నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women's Day 2020). ఈ రోజుని ప్రత్యేకంగా మహిళలు సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతి సంవత్సరం మార్చి 8న ఉమెన్స్ డేని (Women's day) సెలబ్రేట్ చేసుకుంటారు. గూగుల్ డూడుల్ (Google Doodle) కూడా ప్రత్యేకంగా మహిళల కోసం ఓ వీడియోని రూపొందించింది. అందులో ఘనంగా మహిళల గురించి చాటి చెప్పింది.

స్కాట్లాండ్ సైంటిస్ట్ మేరీ సోమెర్‌విల్లేకు గూగుల్ డూడుల్ ఘన నివాళి

అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women's Day) ఈ రోజునే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు. దీనికి కారణం ఏంటి ? ఎందుకు ఈ రోజున మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీనికి ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా, ఇలాంటి విషయాలను ఈ రోజున గుర్తు చేసుకుందాం,

అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. 1908 సంవత్సరంలో తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు. ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది.

1917 యుద్ధ సమయంలో రష్యా మహిళలు ఆహారం - శాంతి డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. నాలుగు రోజుల తర్వాత అప్పటి రష్యా సామ్రాట్ నికోలస్ జా 2 సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడు తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును మంజూరు చేసింది. మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23 ఆదివారం. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే అది మార్చి 8వ తేదీ. అందుకే మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు.

వ్యసనం అనేది జీవితంలో పరాజయం కానే కాదు, అదొక మానసిక స్థితి అంతే

దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించి, ప్రతి ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 1975వ సంవత్సరంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా గుర్తించింది. 1996 సంవంత్సరం నుంచి ప్రతి సంవత్సరం వార్షిక ఇతివృత్తాన్ని అనుసరించడం ప్రారంభించింది. మొదటి ఇతివృత్తం 'గతాన్ని వేడుక చేసుకోవడం, భవిష్యత్తుకు ప్రణాళికలు రచించుకోవడం' అని మొదటి థీమ్‌ ను నిర్ణయించింది. అయితే ఈ ఏడాది ప్రతి ఒక్కరు సమానం అన్నది ఈ ఏడాది థీమ్‌. ఇదే ఈ సంవత్సర లక్ష్యం కూడా.

2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు కూడా జరిగాయి. సాంకేతికంగా చెప్పాలంటే ఈ ఏడాది జరిగేది 108వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సామాజికంగాను, రాజకీయాల్లోనూ, ఆర్థిక రంగంలోనూ మహిళలు ఎంత మేరకు ఎదిగారో తెలుసుకుని, వేడుక చేసుకునే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మారిపోయింది.

వాస్తవానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్‌ దేశాల్లో నిర్వహించారు. 1913 లో రష్యాలోఅంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు అధికారిక సెలవుదినంగా ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కనీసం 20 దేశాలలో అధికారిక సెలవుదినంగా జరుపుకుంటారు. వీటిలో ఆఫ్ఘనిస్తాన్, క్యూబా, లావోస్, రష్యా, వియత్నాం లాంటి దేశాలు ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ విషయానికొస్తే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అధికారిక సెలవుదినంగా గుర్తించబడలేదు.

ఉమెన్స్ డే - ప్రముఖుల కొటేషన్లు (Women's Day Greetings)

1. అభివృద్ధి చెందుతున్న సమాజం.. అర్థరహిత సమజాపు మధ్య తేడానే మహిళా విజయం -మిచెల్లీ ఒబామా

2. ప్రపంచంలో మహిళల శక్తిని ఎవరూ ఆపలేరు -హిల్లరీ క్లింటన్

3. చరిత్ర సృష్టించాలంటే సమాజం దృష్టిలో మంచి నడవడిక ఉండక్కర్లేదు -ఎల్నార్ రూజ్‌వెల్ట్

4. తీవ్రవాదులను అతిగా భయపెట్టేది పుస్తకం పట్టుకున్న మహిళే -మలాలా

5. ఏవిషయంలోనైనా పురుషులకి పోటీగా మహిళలు రాణించగలరు, మానసిక సామర్థ్యం వారికి అదనపు బహుమతి -మహాత్మాగాంధీ

6. స్తీ లేకపోతే జననం, మరణం లేదు, స్త్రీ లేకపోతే గమనమే లేదు, అసలు పుట్టుకనేదే లేదు - ఓ మహిళ