PM Modi Meeting with CMs: లాక్‌డౌన్ కొనసాగింపుకే ప్రధాని మొగ్గు చూపారా?, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్, తుది నిర్ణయం ఎప్పుడంటే...?

రాష్ట్రాల సీఎంలతో కరోనావైరస్ మీద ఇది నాలుగవ సమావేశం.

PM Modi conducts meeting with CMs to discuss lockdown exit strategy (photo-ANI)

New Delhi, April 27: కరోనావైరస్ (Coronavirus) కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ ( Lockdown) మే 3తో ముగియనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi Meeting with CMs) నిర్వహించిన ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ (Video Conference) సమావేశం దేశమంతా ఉత్కంఠ రేపుతోంది. ప్రజలు మరికొన్ని రోజులు లాక్‌డౌన్‌కు సహకరించాలి, ప్రధాని మోదీతో ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత మరింత స్పష్టత వస్తుంది: తెలంగాణ సీఎం కేసీఆర్

కాగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ, వారందరి అభిప్రాయాలనూ స్వీకరించిన తరువాత లాక్డౌన్ ను మే 3 తరువాత పొడిగింపునకే ( lockdown exit strategy) మొగ్గు చూపారని తెలుస్తోంది. రాష్ట్రాల సీఎంలతో కరోనావైరస్ మీద ఇది నాలుగవ సమావేశం.

అధికార వర్గాల నుంచి అందుతున్న సంకేతాల మేరకు కొన్ని నిబంధనల సడలింపులు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఈ సమావేశంలో 9 మంది ముఖ్యమంత్రులు ప్రధానితో లాక్ డౌన్ పై తమ అభిప్రాయాలు పంచుకున్నారని తెలుస్తోంది. వీరిలో అత్యధిక సీఎంలు లాక్ డౌన్ ను పొడిగించాలని, అయితే, నిత్యావసరాలతో పాటు మరిన్ని విభాగాలను అనుమతించాలని సూచించినట్టు తెలుస్తోంది. ప్రధాని ‘దో గజ్ కి డూరి’ నినాదం, కరోనా మంచి గుణపాఠం నేర్పింది, పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా సర్పంచులతో ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్‌

అందరి అభిప్రాయాలనూ తీసుకున్న నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, పలు నగరాల్లో క్షేత్ర స్థాయిలో పరిస్థితులను మదింపు చేసిన కేంద్ర బృందాల అభిప్రాయాలను తీసుకున్న తరువాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.

Here are a few images of PM Holding Video conference with CMs

లాక్ డౌన్ కొనసాగించాల్సిన ప్రాంతాలు, గ్రీన్ జోన్ ప్రాంతంలో అనుమతించాల్సిన కార్యకలాపాలు, ప్రజా రవాణా ప్రారంభిస్తే, తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై నిర్ణయం తీసుకునే ముందు, మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసి, కేసుల స్థితిని పరిశీలించాల్సి వుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా రోజురోజుకూ కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడంతో పాటు మృత్యుల సంఖ్యా 1000కి చేరువులో ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ లాక్‌డౌన్‌పై ఎలాంటి నిర్ణయంపై తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. ఈ సమావేశంలో భాగంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి ప్రధాని సమాచారాన్ని సేకరిస్తూనే వారి నుంచి సూచనలు సలహాలు తీసుకుంటున్నారు. ఆ ఐదు నగరాల్లో పూర్తిగా లాక్‌డౌన్, కీలక నిర్ణయం తీసుకున్న తమిళనాడు సర్కారు, మరింత కఠిన నిబంధనలతో లాక్‌డౌన్ అమలు

అయితే వైరస్‌ తీవ్రతను బట్టి కేంద్ర ప్రభుత్వం ప్రాంతాల వారిగా సడలింపు ఇస్తుందని తెలుస్తోంది. మరికొన్ని సేవలకు సడలింపు ఇస్తూనే లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేసేలా కేంద్రం ఆలోచన చేస్తోంది. మరోవైపు తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్తాన్‌, తమిళనాడు లాంటి రాష్ట్రాలు మాత్రం మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ ఆంక్షలను కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడులో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. అదే స్థాయిలో మరణాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఈ తరుణంలో లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తే తీవ్ర అనార్థాలు చోటుచేసుకునే అవకాశం ఉందని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాని దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం.

మరోవైపు ప్రజల ప్రాణాల్ని కాపాడుకుంటూనే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి వివిధ దేశాలు అనుసరించిన విధానాల్ని కూడా పరిశీలిస్తోంది. దీనిలో భాగంగానే మే 3 నుంచి దశల వారిగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై ప్రధాని మోదీ చేయబోయే ప్రకటన కీలకం కానుంది.

ముఖానికి మాస్క్‌లు ధ‌రించ‌డం మ‌న జీవితాల్లో భాగ‌మైన‌ట్లు ప్ర‌ధాని మోదీ మ‌న్‌కీ బాత్ రేడియో కార్య‌క్ర‌మం‌లో తెలిపారు. మాస్క్‌లు ధ‌రించిన వారిని రోగులుగా చూడ‌కూడ‌ద‌ని, నాగ‌రిక స‌మాజానికి మాస్క్‌లు చిహ్నంగా మారాయ‌న్నారు. మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకోవాల‌న్నా, లేక ఇత‌రుల్ని వ్యాధి నుంచి కాపాడాల‌న్నా.. మాస్క్‌లు ధ‌రించ‌డం చాలా ముఖ్య‌మ‌న్నారు. బ‌హిరంగ స్థ‌లాల్లో ఉమ్మివేస్తే క‌లిగే అన‌ర్ధాల ప‌ట్ల ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెరిగింద‌ని మోదీ అన్నారు. ఇలాంటి అల‌వాటును ఆపాల్సిన సంద‌ర్భం వ‌చ్చింద‌న్నారు. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ఉమ్మివేసే అల‌వాటును మానేసే త‌రుణం ఆస‌న్న‌మైంద‌న్నారు. కోవిడ్‌19 మ‌హమ్మారిని అరిక‌ట్ట‌డంలో రాష్ట్ర ప్ర‌భుత్వాలు చూపిన చొర‌వ‌ను ప్ర‌ధాని మెచ్చుకున్నారు.