PM Modi Lakshadweep Island Visit: ప్రధాని మోదీ విజిట్ తర్వాత ట్రెండింగ్‌లోకి వచ్చిన లక్షద్వీప్, ఆ కీ వర్డ్‌ని గూగుల్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు

ప్రపంచవ్యాప్తంగా, లక్షద్వీప్ కోసం గూగుల్ సెర్చ్‌లు గత 20 ఏళ్లలో అత్యధికంగా ఉన్నాయి, అయితే ప్రధాని మోదీ పర్యటన తర్వాత ఈ కీవర్డ్ పీక్ స్టేజీకి వెళ్లిపోయింది.

Prime Minister Narendra Modi in Lakshadweep (Photo Credits: PMO)

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని సందర్శించి, సుందరమైన ద్వీపసమూహంలోని కొన్ని ఫోటోలను షేర్ చేసిన తర్వాత వరుసగా గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో లక్షద్వీప్ కీవర్డ్ దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా, లక్షద్వీప్ కోసం గూగుల్ సెర్చ్‌లు గత 20 ఏళ్లలో అత్యధికంగా ఉన్నాయి, అయితే ప్రధాని మోదీ పర్యటన తర్వాత ఈ కీవర్డ్ పీక్ స్టేజీకి వెళ్లిపోయింది.

భారత్‌కు క్షమాపణలు, మాల్దీవులను మీరు బహిష్కరిస్తే మా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది, ఆందోళన వ్యక్తం చేసిన మాజీ మంత్రి అహ్మద్ మహ్లూఫ్

ప్రధాని మోదీ ఆ ద్వీపాన్ని అందంగా వర్ణిస్తూ.. ద్వీపాల యొక్క "అద్భుతమైన" అందం మరియు దాని యొక్క "అద్భుతమైన వెచ్చదనం" గురించి తాను "ఇప్పటికీ విస్మయం చెందుతూనే ఉన్నాను" అని ప్రధాన మంత్రి అన్నారు. దీంతో నెటిజన్లు కీవర్డ్‌ లక్షద్వీప్ ను గూగుల్ భారీగా శోధించడం మొదలు పెట్టారు. ప్రధానమంత్రి లైఫ్ జాకెట్‌లో ఉండి, ఆయన బస చేసిన సమయంలో స్నార్కెల్లింగ్‌లో చేసిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.