Transparent Taxation: పన్ను చెల్లించే వారికి గుడ్ న్యూస్, సెప్టెంబర్ 25 నుంచి ఫేస్‌లెస్ అసెస్‌మెంట్, పన్నువిధానంలో భారీ సంస్కరణలను చేపడుతున్నట్లు తెలిపిన ప్రధాని మోదీ
పారదర్శక పన్నువిధానం వేదికను ఇవాళ ప్రధాని మోదీ (PM Narendra Modi) ప్రారంభించారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పన్ను వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు తెచ్చేందుకు 'పారదర్శక పన్నుల విధాన వేదిక' (Transparent Taxation-Honoring the Honest) ఉపయోగపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పేర్కొన్నారు. ఢిల్లీ వేదికగా మోదీ గురువారం పారదర్శక పన్నుల విధాన వేదిక కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
New Delhi, August 13: నిజాయితీగా పన్ను చెల్లించే వారికి మరింత సులువైన విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. పారదర్శక పన్నువిధానం వేదికను ఇవాళ ప్రధాని మోదీ (PM Narendra Modi) ప్రారంభించారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పన్ను వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు తెచ్చేందుకు 'పారదర్శక పన్నుల విధాన వేదిక' (Transparent Taxation-Honoring the Honest) ఉపయోగపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పేర్కొన్నారు. ఢిల్లీ వేదికగా మోదీ గురువారం పారదర్శక పన్నుల విధాన వేదిక కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్‌లతోపాటు దేశంలోని వాణిజ్య సంస్థలు, చార్టర్డ్ అకౌంటెంట్లు, గణనీయమైన పన్ను చెల్లింపుదారుల అసోసియేషన్లు పాల్గొన్నారు.
కొత్తగా తీసుకురానున్న పన్నువిధానం ద్వారా పన్నుదారుడు నేరుగా హాజరు కాకుండా ఉండే విధంగా తయారు చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. పన్నువిధానంలో భారీ సంస్కరణలను చేపడుతున్నట్లు ప్రధాని తెలిపారు. ఆదాయపన్ను, కార్పొరేట్ పన్నులను తగ్గించినట్లు తెలిపారు. సక్రమంగా పన్నులు చెల్లిస్తున్నవారిని మరింత ప్రోత్సహిస్తామన్నారు. ప్రత్యేక వేదిక ద్వారా ఫిర్యాదులు సులువుగా చేయవచ్చు అన్నారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పన్ను విధానంలో మరిన్ని సంస్కరణలను తీసుకువస్తున్నట్లు తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న నెల తరువాత మళ్లీ పాజిటివ్, దేశంలో తాజాగా 66,999 మందికి కోవిడ్-19, భారత్‌లో 23,96,638కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య
పారదర్శక పన్నువిధానంలో ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ (Faceless Assessment) అతిపెద్ద సంస్కరణ అన్నారు. ఫేస్‌లెస్ అపీల్, పన్నుదారుల పట్టిక కూడా సంస్కరణలో భాగమే అన్నారు. ఫేస్‌లెస్ అసెస్‌మెంట్, ట్యాక్స్ పేయర్ చార్టర్‌లు నేటి నుంచే అమలులోకి వస్తాయన్నారు. ఫేస్‌లెస్ అపీల్ సేవలు మాత్రం సెప్టెంబర్ 25 నుంచి అందుబాటులోకి రానున్నట్లు ప్రధాని వెల్లడించారు.
ఏదో ఒక వత్తిడిలో సంస్కరణల పేరుతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారని, అలాంటి వాటితో లక్ష్యాలను చేరుకోలేమన్నారు. అలాటి ఆలోచన, వ్యవహారం అన్నీ మారినట్లు ప్రధాని తెలిపారు. పన్నువిధానాన్ని సాఫీగా తయారు చేయడం తమ ఉద్దేశమన్నారు. దేశాభివృద్ధి ప్రయాణంలో పన్నుదారుడి చార్టర్ కూడా పెద్ద ముందడుగే అని తెలిపారు. కాగా పన్నుదారులను మరింత శక్తివంతంగా తయారు చేయడమే ప్రధాని లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పన్నవిధానంలో పారదర్శకత ఉండాలని, నిజాయితీపరుడైన పన్నుదారుల్ని గౌరవించాలన్నదే ప్రధాని లక్ష్యమన్నారు.
ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇటీవలి కాలంలో ప్రత్యక్ష పన్నుల విధానంలో పలు మార్పులు తీసుకొచ్చిందని, గతేడాది కార్పొరేట్ ట్యాక్స్ రేట్లను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించామని, కొత్త తయారీ సంస్థలకు దీన్ని పదిహేను శాతం చేశామని వివరించింది. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పన్నును కూడా రద్దు చేసినట్లు తెలిపింది. పన్నుల రేట్లు తగ్గింపు, నిబంధనల సరళీకరణలే లక్ష్యంగా ప్రత్యక్ష పన్నుల విధానంలో సంస్కరణలు తీసుకువస్తున్నట్లు మోదీ తెలిపారు.