PM Modi: ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం..గయానా 'ది ఆర్డర్ ఆఫ్ ఎక్స్ లెన్స్' పురస్కారం, డొమినికా అత్యున్నత పురస్కారంతో సత్కారం
గయానా దేశం...మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ఎక్స్ లెన్స్’ను అందజేసింది. ఈ పురస్కారాన్ని గయానా దేశ అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ మోదీకి అందజేశారు. ప్రపంచ దేశాలకు మోదీ అందిస్తున్న సహాయ సహకారాలకుగాను ఈ గుర్తింపు లభించింది.
Hyd, Nov 21: విదేశీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. గయానా దేశం...మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ఎక్స్ లెన్స్’ను అందజేసింది. ఈ పురస్కారాన్ని గయానా దేశ అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ మోదీకి అందజేశారు. ప్రపంచ దేశాలకు మోదీ అందిస్తున్న సహాయ సహకారాలకుగాను ఈ గుర్తింపు లభించింది.
అలాగే కరేబియన్ దేశం కామన్వెల్త్ ఆఫ్ డొమినికా.... తమ దేశ అత్యున్నత జాతీయ అవార్డును మోదీకి అందజేసింది. డొమినికా అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్.. ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్ తో సత్కరించారు. కొవిడ్ -19 సంక్షోభ సమయంలో మోదీ ఆ దేశానికి అందించిన మద్దతు, భారత్ – డొమినికా దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ అత్యున్నత పురస్కారంతో సత్కరించామని సిల్వానీ బర్టన్ తెలిపారు. మోదీ చేసిన కృషికిగాను డొమినికా అత్యున్నత పురష్కారంతో సత్కరించారు. వ్యాపారాల కోసం రూ.2,236 కోట్లు లంచం, అమెరికాలో అదానిపై మోసపూరిత కుట్ర కింద నేరాభియోగాలు, కుప్పకూలిన అదాని గ్రూప్ షేర్లు
Here's Tweet:
డొమినికా అత్యున్నత జాతీయ అవార్డుతో సత్కరించడం గౌరవంగా భావిస్తున్నాను అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ పురస్కారాన్ని 140 కోట్ల మంది భారత ప్రజలకు అంకితం చేస్తున్నానని వెల్లడించారు. భారతదేశం -డొమినికా రెండు ప్రజాస్వామ్య దేశాలు..ఈ రెండు దేశాలకు మహిళా అధ్యక్షురాళ్లు ఉన్నారు అన్నారు. ఈ పురస్రాకంతో ప్రధాని మోదీ అందుకున్న మొత్తం అంతర్జాతీయ అవార్డుల సంఖ్య 19కి చేరుకుంది.
Here's Tweet: