Ramgampa Teja: ప్రధాని మోడీ మన్ కీ బాత్, కరోనా నుంచి కోలుకున్న రామ్‌గంపా తేజతో మాట్లాడిన ప్రధాని, కోవిడ్ 19ను అతను ఎలా జయించారో తెలుసుకున్న మోడీ
సంభాషణ సందర్భంగా, కరోనావైరస్పై జరిగిన వార్‌లో రాంగంపా తేజ ఎలా గెలిచారో తెలుసుకోవాలని ప్రధాని మోడీ (Prime Minister Narendra Modi) కోరారు. కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్‌లో ప్రజలతో మాట్లాడుతున్నారు.
New Delhi, Mar 29: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) తన "మన్ కి బాత్" (Mann Ki Baat) ప్రసంగంలో, కరోనావైరస్ బారిన పడిన తర్వాత కోలుకున్న రామ్‌గంపా తేజతో (Ramgampa Teja) మాట్లాడారు. సంభాషణ సందర్భంగా, కరోనావైరస్పై జరిగిన వార్‌లో రాంగంపా తేజ ఎలా గెలిచారో తెలుసుకోవాలని ప్రధాని మోడీ (Prime Minister Narendra Modi) కోరారు. కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్‌లో ప్రజలతో మాట్లాడుతున్నారు.
కరోనాపై పోరులో భాగంగా లాక్‌డౌన్ వంటి అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తనను క్షమించాలని వ్యాఖ్యానించారు. తనపై కొందరు ఆగ్రహంతో ఉన్నారని తనకు తెలుసని అన్నారు. అయినప్పటికీ, కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఈ కఠిన చర్యలు తీసుకోకతప్పదని చెప్పారు.
ముఖ్యంగా పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మోదీ గుర్తు చేశారు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నది జీవన్మరణ సమస్య అయినందువల్లే కఠిన నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వైరస్ వ్యాప్తి ప్రారంభమైన రోజుల్లో చర్యలు తీసుకుంటేనే కరోనాను తొలగించవచ్చని అన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే దేశ ప్రజలు కొన్ని రోజులు లక్ష్మణ రేఖ దాటొద్దని వ్యాఖ్యానించారు.
Here's PM Tweet
కాగా కోవిడ్-19పై పోరాటంలో దేశ యువత ముందు వరుసలో ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కరోనాపై పోరాటం కోసం ప్రధాన్ మంత్రి సిటిజన్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచుయేషన్(పీఎం కేర్స్) నిధి ని కేంద్ర ప్రభుత్వం శనివారం ఏర్పాటు చేసింది. దీనికి విరివిగా విరాళాలు ఇవ్వాలని దేశ ప్రజలను ప్రధాని మోదీ కోరారు. ఆరోగ్యవంతమైన భారత్‌కు ఇది దోహదపుడుతుందన్నారు. ప్రజలు www.pmindia.gov.in సైట్‌లో విరాళాలు చెల్లించాలన్నారు.