PM Modi Takes COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, ప్రధానికి టీకా ఇచ్చిన సిస్టర్ నివేదా, అర్హులైన ప్రతి ఒక్కరు కొవిడ్ టీకా వేయించుకోవాలని ప్రధాని పిలుపు
దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా ఈ రోజు నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి, 45 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగి, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నవారికి టీకా ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ప్రధాని మోదీ తొలి డోసు టీకాను (PM Modi takes first dose of covid-19 vaccine) తీసుకున్నారు.
New Delhi, March 1: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం కరోనా టీకా (Coronavirus Vaccine) వేయించుకున్నారు. దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా ఈ రోజు నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి, 45 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగి, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నవారికి టీకా ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ప్రధాని మోదీ తొలి డోసు టీకాను (PM Modi takes first dose of covid-19 vaccine) తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన దేశప్రజలంతా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ‘మనమందరం కలిసికట్టుగా భారత్‌ను కొవిడ్ రహిత దేశంగా తీర్చిదిద్దాలని’ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా ప్రధాని మోదీ భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ టీకాను తీసుకున్నారు. ఎయిమ్స్‌లో పనిచేస్తున్న సిస్టర్ నివేదా ( Sister P Niveda) ప్రధానికి టీకా ఇచ్చారు.
కరోనాపై వైద్యులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ప్రధాని కొనియాడారు. ‘ఎయిమ్స్‌లో కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నాను. ప్రపంచవ్యాప్తంగా కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి వైద్యులు, శాస్త్రవేత్తలు వేగంగా చేస్తున్న కృషి ప్రశంసనీయమైనది. అర్హులైన ప్రతి ఒక్కరు కొవిడ్ టీకా వేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. మనమంతా సమష్టి కృషితో భారత్‌ను కరోనా రహిత దేశంగా మారుద్దాం’ అని అన్నారు.
దేశంలో కరోనా కేసులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి, రోజు రొోజుకు భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ, లాక్ డౌన్ విధించేందుకు రెడీ అయ్యాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో సరిహద్దుల వద్ద ఆంక్షలు విధించారు. అంతర్జాతీయ విమానాలను మార్చి 31 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.