EAM S Jaishankar Comments: భార‌త విదేశాంగ విధానంపై కేంద్ర‌మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు, ప‌దేళ్లలో ఎంతో మారిపోయింద‌న్న జైశంక‌ర్, కెనడాతో స్నేహంపై ఏమ‌న్నారంటే?

జై శంకర్‌ (S Jaishankar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మన దేశం ‘విశ్వమిత్ర’గా (Vishwamitra) ఎదుగుతోందని వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాలతో భారత్‌ స్నేహం గురించి ప్రస్తావించారు. వీలైనంత ఎక్కువ మందితో స్నేహం చేయాలనుకుంటోందని అన్నారు. ఢిల్లీలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్‌ నేడు ‘విశ్వమిత్ర’గా ఎదుగుతోంది.

New Delhi, NOV 02: భారత్‌పై విదేశాంగ మంత్రి ఎస్‌. జై శంకర్‌ (S Jaishankar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మన దేశం ‘విశ్వమిత్ర’గా (Vishwamitra) ఎదుగుతోందని వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాలతో భారత్‌ స్నేహం గురించి ప్రస్తావించారు. వీలైనంత ఎక్కువ మందితో స్నేహం చేయాలనుకుంటోందని అన్నారు. ఢిల్లీలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్‌ నేడు ‘విశ్వమిత్ర’గా ఎదుగుతోంది. వీలైనంత ఎక్కువ మందితో సత్ససంబంధాలు ఏర్పరుచుకోవాలని అభిప్రాయపడుతోంది. కానీ, అంతర్జాతీయ వేదికపై కొంతమంది స్నేహితులు క్లిష్టంగా ఉండొచ్చు. పరస్పర గౌరవం, దౌత్యపరమైన మర్యాద వంటివి పాటించకపోవచ్చు.

Bandi Sanjay: బండి సంజయ్ కీలక కామెంట్స్... ఎన్నికల వరకే  రాజకీయాలు...కాంట్రాక్టర్లను బెదిరించడం సరికాదన్న కేంద్రమంత్రి 

అనేక సందర్భాల్లో భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. భాగస్వాములను విశ్లేషించే విషయంలో సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి’’ అని వ్యాఖ్యానించారు. కెనడాతో దౌత్య వివాదాలు కొనసాగుతున్న వేళ జైశంకర్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘దేశం ఒక అత్యుత్తమ శక్తిగా మారుతున్న క్రమంలో ప్రపంచ దృష్టి ఆకర్షిస్తుంది. అలాంటి సమయంలో కొన్ని ప్రధాన శక్తులతో స్నేహం చేయడం కూడా ఒక సవాలే’’ అని విదేశాంగ మంత్రి అన్నారు. కాగా.. ఖలిస్థానీ మద్దతుదారులను లక్ష్యంగా చేసుకొని భారత ప్రభుత్వ ఏజెంట్లు పనిచేస్తున్నారని, వారికి లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగుతో సంబంధాలున్నాయని కెనడా ఆరోపిస్తోంది. దీంతో ఇరుదేశాల మధ్య దౌత్యవివాదం మొదలైంది.