PM Modi Net Worth: ప్రధాని మోదీ చేతికి నాలుగు బంగారు ఉంగరాలు, వీటి ఖరీదు 1.73 లక్షలు, ప్రస్తుతం ఆయన వద్ద రూ.2.23 కోట్ల ఆస్తులు
ప్రస్తుతం ఆయన వద్ద రూ.2.23 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఎక్కువ శాతం బ్యాంక్ డిపాజిట్ల రూపంలో ఆ మొత్తం ఉంది. అయితే ఆయన పేరు మీద ఎటువంటి స్థిరాస్తి లేదు.
New Delhi, August 9: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్తులు (PM Modi Net Worth) గతంతో పోలిస్తే భారీగానే పెరిగాయి. ప్రస్తుతం ఆయన వద్ద రూ.2.23 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఎక్కువ శాతం బ్యాంక్ డిపాజిట్ల రూపంలో ఆ మొత్తం ఉంది. అయితే ఆయన పేరు మీద ఎటువంటి స్థిరాస్తి లేదు. గాంధీనగరలో ఉన్న స్థలాన్ని ఆయన డొనేట్ చేశారు. బాండ్, షేర్, మ్యుచువల్ ఫండ్స్‌లో ఆయనకు పెట్టుబడి లేదు. స్వంత వాహనం కూడా లేదు.
నరేంద్ర మోదీకి నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి. వాటి విలువ 1.73 లక్షలు. మార్చి 31వ తేదీన ఇచ్చిన డిక్లరేషన్ ఆధారంగా ఈ వివరాలు తెలిశాయి. ఏడాది కాలంలో మోదీ ఆస్తులు 26.13 లక్షలు (Total Assets Rise by Rs 26 Lakh to Rs 2.23 Crore)పెరిగినట్లు తెలుస్తోంది. గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ఓ రెసిడెన్షియల్ ప్లాట్‌ను ముగ్గురితో కలిసి కొన్నారు. అయితే ఆ ఫ్లాట్‌ను (Donated Immovable Property Worth Rs 1.1 Crore) దానం చేసినట్లు తెలుస్తోంది.
ప్రధాని మోదీకి చెందిన చరాస్తులు ఏడాది క్రితం 2021, మార్చి 31 నాటికి రూ.26.13 లక్షలుగా ఉండేవి. రూ.1.1 కోట్లు విలువైన స్థిరాస్తి ఉంటే దానిని విరాళంగా ఇచ్చారు. 2022, మార్చి 31 నాటి డిక్లరేషన్ ప్రకారం ప్రస్తుతం మోదీ వద్ద ఆస్తులు రూ.2,23,82,504 ఉన్నాయి. ఈ మేరకు వివరాలను ప్రధానమంత్రి కార్యాలయం వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేసింది. 2022, మార్చి 31 నాటికి మోదీ చేతిలో రూ.35,350 నగదు ఉంది. అలాగే పోస్ట్‌ఆఫీస్‌లోని నేషనల్ సేవింగ్స్ సర్టిఫెక్ట్ విలువ రూ.9,05,105, జీవిత బీమా పాలసీల విలువ రూ.1,89,305గా ఉన్నాయి.ఇక రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వద్ద చరాస్తులు రూ.2.54 కోట్లు, స్థిరాస్తులు రూ.2.97 కోట్లు ఉన్నాయి.