PM Modi 'Do Gaz Ki Doori': ప్రధాని ‘దో గజ్ కి డూరి’ నినాదం, కరోనా మంచి గుణపాఠం నేర్పింది, పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సర్పంచులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ (Prime Minister Narendra Modi video conference) నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పలువురు సర్పంచ్‌లతో మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ముందుగా ఈ-గ్రామ స్వరాజ్ పోర్టల్ (e-GramSwaraj Portal) మొబైల్ యాప్‌ను మోదీ ఆవిష్కరించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉత్తమ గ్రామపంచాయతీలకు గ్రామస్వారాజ్ పోర్టల్ అండ్ మొబైల్ అప్లికేషన్ ద్వారా అవార్డులు ఇచ్చారు. వివిధ రాష్ట్రలకు చెందిన మంత్రులు, సర్పంచ్‌లతో మోడీ మాట్లాడారు. కరోనా లాక్‌డౌన్‌ను (Corona Lcokdown) పాటిస్తున్న విధానాలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు
New Delhi, April 24: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ (Prime Minister Narendra Modi video conference) నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పలువురు సర్పంచ్‌లతో మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ముందుగా ఈ-గ్రామ స్వరాజ్ పోర్టల్ (e-GramSwaraj Portal) మొబైల్ యాప్‌ను మోదీ ఆవిష్కరించారు. 80 జిల్లాల్లో నో కేసులు, ఇండియాలో కరోనా రికవరీ శాతం 20.57, మొత్తం 23 వేలు దాటిన కరోనా కేసులు, వివరాలను వెల్లడించిన ఆరోగ్య శాఖ
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉత్తమ గ్రామపంచాయతీలకు గ్రామస్వారాజ్ పోర్టల్ అండ్ మొబైల్ అప్లికేషన్ ద్వారా అవార్డులు ఇచ్చారు. వివిధ రాష్ట్రలకు చెందిన మంత్రులు, సర్పంచ్‌లతో మోడీ మాట్లాడారు. కరోనా లాక్‌డౌన్‌ను (Corona Lcokdown) పాటిస్తున్న విధానాలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. చైనా నాసిరకం కిట్లకు డబ్బులు చెల్లించలేదు, ఆ కిట్లను వెనక్కి పంపిస్తాం, ఇండియాలో కరోనా వ్యాప్తి చాలా తక్కువ, మీడియాతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్
గ్రామీణ భారతదేశం ఇచ్చిన "దో గజ్ దేహ్ కి డూరి" నినాదం (PM Modi 'Do Gaz Deh Ki Doori') ప్రజలకు జ్ఞానాన్ని చూపించిందని ఆయన అన్నారు. ఈ నినాదాన్ని ఆయన ప్రశంసించారు, ఇది సామాజిక దూరాన్ని అభ్యసించడానికి ప్రజలను ప్రేరేపిస్తుందని తెలిపారు. ప‌్రతి ఒక్కరూ ఆత్మస్థైర్యంతో ఉండగలిగేలా కరోనా (COVID-19 outbreak) గొప్ప గుణపాఠం నేర్పిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కరోనా నివారణకు కృషిచేస్తున్న సర్పంచులందరికీ ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. మెరుగైన సేవలతో పురస్కారాలు పొందిన సర్పంచులను అభినందించారు.
Here's PM Tweet
PM dedicated the e-GramSwaraj App to the nation
ఏటా మెరుగైన పనితీరు కనబర్చిన గ్రామపంచాయతీలకు పురస్కారాలు అందిస్తామని ఈ సందర్భంగా ప్రధాని ప్రకటించారు. కరోనా సంక్షోభ సమయంలో పేదలకు సరిపడా ఆహారధాన్యాలు అందుబాటులో ఉంచాలని సర్పంచులకు సూచించారు. విద్యుత్, రహదారులు, పారిశుద్ధ్యం మెరుగు కోసం చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో సుపరిపాలన అందించేందుకు పంచాయతీరాజ్‌శాఖ ఎంతో కృషి చేస్తోందని, పంచాయతీ వ్యవస్థ ఎంత బలపడితే ప్రజాస్వామ్యం అంత బలపడుతుందని ప్రధాని పేర్కొన్నారు. కరోనా నియంత్రణపై గుడ్ న్యూస్, సానుకూల ఫలితాలను ఇస్తోన్న ప్లాస్మా చికిత్స, మీడియాకు వెల్లడించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్షా 25 వేల పంచాయతీల్లో బ్రాండ్ బ్యాండ్ సేవలు అందుతున్నాయని ప్రధాని తెలిపారు. కరోనా మహమ్మారి మనకు గొప్ప గుణపాఠం నేర్పిందని, కష్టం సమయంలో ఆత్మస్థైర్యంతో ఉండటం ఎలాగో ప్రతి ఒక్కరికీ తెలిసొచ్చేలా చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలంతా ఇండ్లలోనే ఉండి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని ప్రధాని పిలుపునిచ్చారు. కరోనాపై గ్రామ ప్రజల్లో మరింత అవగాహన, చైతన్యం కల్పించాలని సర్పంచుకులకు సూచించారు. పొగతాగే వారికి కరోనావైరస్ ముప్పు తక్కువా? నికోటిన్ పొర వైరస్ సోకకుండా అడ్డుకట్ట వేస్తుందని చెప్తున్న తాజా అధ్యయనం, ఇంకా నిర్ధారణ కాలేదని వెల్లడి
'' డూ గాజ్ కి డూరి ' (రెండు గజాల దూరంలో) స్లోగన్ గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు. గ్రామీణ భారతం కోవిడ్ 19 మీద పోరాటం గట్టిగా చేస్తోందని ఇది ఇలాగే కొనసాగితే మంచి ఫలితాలు వస్తాయని ప్రధాని పిలుపునిచ్చారు. గ్రామ సర్పంచులు ఈ విషయంలో చొరవచూపాలని మహమ్మారిపై పోరాడటానికి తమ వంతు ప్రయత్నం చేసి కరోనాని తరిమి కొట్టాలని అన్నారు
ఈ మహమ్మారి దేశానికి ఇంతకు ముందెన్నడూ ఎదుర్కోని కొత్త సవాళ్లను విసిరిందని, అయితే ఇది ప్రజలను కొత్త విషయాలు నేర్చుకునేలా చేసిందని మోడీ అన్నారు. "COVID-19 ఇచ్చిన అతి పెద్ద సందేశం, అది నేర్పించిన అతి పెద్ద పాఠం ప్రజలు స్వంతంగా తమ పనులు చేసుకునే అవకాశం కల్పించిందని అన్నారు " అని మోడీ అన్నారు, గ్రామాలు కూడా వారి ప్రాథమిక అవసరాలకు స్వంతంగా సమకూర్చుకోవడం ఇప్పుడు అత్యవసరమని తెలిపారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)